తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన, ప్రభుత్వ వైఫల్యమే – టీడీపీ అధినేత చంద్రబాబు

TDP Chief Chandrababu Slams YCP Govt Over Tirupati RUIA Hospital Incident, Chandrababu Slams YCP Govt Over Tirupati RUIA Hospital Incident, TDP Chief Chandrababu Slams YCP Govt, TDP Chief Chandrababu Naidu, Chandrababu Naidu, Chandrababu Slams YCP Govt, TDP Chief Chandrababu Coments On YCP Govt, TDP Chief Chandrababu Sensational Comments On YCP Govt, TDP Chief Chandrababu Intresting Comments On YCP Govt, Tirupati RUIA Hospital Incident, Tirupati RUIA Hospital Incident News, Tirupati RUIA Hospital Incident Latest News, Tirupati RUIA Hospital Incident Latest Updates, Tirupati RUIA Hospital Incident Live Updates, Mango News, Mango News Telugu,

ఈరోజు తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటుచేసుకున్న సంఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రుయా ఆసుపత్రి నుంచి ఒక బాలుడి మృతదేహాన్ని ఆ బాలుడి తండ్రి బైక్‌పై తరలించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తన ఆవేదనను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడు జేసవాకు కిడ్నీ అనారోగ్యంతో రుయా ఆసుపత్రిలోని చిన్న పిల్లల విభాగంలో చేర్చారు. అయితే మంగళవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి ఆ బాలుడు మృతి చెందాడు. ఈ క్రమంలో ఆ బాలుడి మృతదేహాన్ని తలించేందుకు రాజంపేట నుంచి వచ్చిన ఉచిత అంబులెన్స్ ను ఆస్పత్రిలోకి రాకుండా అక్కడి లోకల్ అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది.

బాలుడి మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి సుమారు రూ.20 వేల వరకు డిమాండ్‌ చేశారు. దీంతో గత్యంతరం లేక బాలుడి తండ్రి మరొకరి సాయంతో బాలుడి మృతదేహాన్ని 90 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి బైక్‌పై తరలించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన తాలూకు వీడియోను చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ దుర్ఘటన మన రాష్ట్రంలో హెల్త్ కేర్ సెక్టార్‌లో ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. కాగా దీనిపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ విషయాన్ని జాల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. బాధ్యులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 5 =