ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ఈ నెల 27న కేంద్ర హోం శాఖ కీలక సమావేశం

Union Home Ministry Plans Meeting to Discuss Pending Bilateral Issues between AP and Telangana on SEP 27, Union Home Ministry Meeting On Ts -Ap Issues, Resolve Water Sharing Issue Amicably, Ministry of Home Affairs, Telangana Andhra Govt Bifurcation Issue, Mango News, Mango News Telugu, Mha To Hold Crucial Meeting, AP And Telangana Bifurcation Issues, HCA Bifurcation Issues Meetings, Union Home Ministry Latest News And Updates, Union Home Ministry , Bilateral Issues between AP and Telangana

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు/ద్వైపాక్షిక సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 27న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27న ఢిల్లీకి రావాలని ఇరురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు, అజెండా సంబంధిత అధికారులకు కేంద్ర హోంశాఖ సమాచారం ఇచ్చింది. అలాగే ఈ సమావేశంలో చర్చించే ద్వైపాక్షిక సమస్యల ఎజెండా, ఇతర అంశాలను కూడా మీటింగ్ నోటీసులో పొందుపరిచారు. సెప్టెంబర్ 27వ తేదీన, ఢిల్లీలో నార్త్ బ్లాక్, హోంశాఖ కార్యాలయంలోని రూమ్ నెంబర్ 119లో ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

ద్వైపాక్షిక సమస్యల ఎజెండా:

  • డివిజన్ ఆఫ్ షెడ్యూల్ IX – ప్రభుత్వ కంపెనీలు మరియు కార్పొరేషన్లు
  • షెడ్యూల్ X విభజన – రాష్ట్ర సంస్థల విభజన
  • చట్టంలో ఎక్కడా పేర్కొనని సంస్థల విభజన
  • డివిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (APSFC)
  • డివిజన్ ఆఫ్ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) మరియు ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (APHMEL)
  • నగదు మరియు బ్యాంక్ బ్యాలెన్స్ విభజన (కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధులు/సాధారణ సంస్థలపై ఖర్చు/ఏక్టర్నల్లి ఎయిడెడ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పబ్లిక్ రుణం)
  • టీఎస్సీఎస్సీఎల్ నుండి ఏపీఎస్సీఎస్సీఎల్ కి చెల్లించాల్సిన నగదు క్రెడిట్ మొత్తం మరియు ఏపీఎస్సీఎస్సీఎల్ కి 2014-15 బియ్యం సబ్సిడీ విడుదల అంశం

ఇతర అంశాలు:

  • పన్ను ప్రోత్సాహకాలు (ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 94 (1) మరియు (2)]
  • రాయలసీమ మరియు ఉత్తర కోస్తా ప్రాంతాన్ని కవర్ చేసే రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి గ్రాంట్
  • పన్ను విషయాలలో అసమానత యొక్క తొలగింపు [సెక్షన్ 50, 51 మరియు 56]
  • వనరుల అంతరం/గ్యాప్
  • కొత్త రాజధాని నగర ఏర్పాటుకు కేంద్ర సహకారం
  • విద్యా సంస్థల స్థాపన
  • కొత్త రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =