వచ్చే పదిరోజుల్లో 30 నియోజక వర్గాల్లో 50 వేల కరోనా పరీక్షలు

CM KCR Orders To Conduct 50,000 Corona Tests in 30 Constituencies in Coming 10 Days

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 14, ఆదివారం నాడు ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. రాబోయే వారం, పదిరోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందు జాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ప్రైవేటు ల్యాబరేటరీలు, ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ నిబంధనలను అనుసరించి వ్యాధి నిర్ధారక పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలు నిర్ణయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో కరోనా పరీక్షలు నిర్వహించబోయే 30 నియోజక వర్గాల జాబితా:

  • ఉప్పల్
  • ఎల్.బి.నగర్
  • మహేశ్వరం
  • ఇబ్రహీంపట్నం
  • రాజేంద్రనగర్
  • శేర్ లింగంపల్లి
  • చేవెళ్ల
  • పరిగి
  • వికారాబాద్
  • తాండూర్
  • మేడ్చల్
  • మల్కాజిగిరి
  • కుత్బుల్లాపూర్
  • కూకట్ పల్లి
  • మలక్ పేట్
  • అంబర్ పేట్
  • ముషీరాబాద్
  • ఖైరతాబాద్
  • జూబ్లీ హిల్స్
  • సనత్ నగర్
  • నాంపల్లి
  • కార్వాన్
    గోషా మహల్
  • చార్మినార్
  • చాంద్రాయణ గుట్ట
  • యాకుత్ పుర
  • బహదూర్ పుర
  • సికింద్రాబాద్
  • సికింద్రాబాద్ కంటోన్మెంట్
  • పటాన్ చెరు

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eight =