ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలు అమలు

AP Govt To Launch YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa Schemes For Marriage To Poor From Oct 1, AP Govt To Launch YSR Kalyanamasthu, AP Govt To Launch YSR Shaadi Tohfa, YSR Kalyanamasthu, YSR Shaadi Tohfa, Mango News, Mango News Telugu, YSR Kalyanamasthu Scheme, YSR Shaadi Tohfa Scheme, YSR Kalyanamasthu And Shaadi Tohfa From OCT 1st, YSR Kalyanamasthu And Shaadi Tohfa For Poor, AP CM YS Jagan Mohan Reddy, YSR Kalyanamasthu And Shaadi Tohfa Latest News, YSR Kalyanamasthu Scheme Live Updates, Shaadi Tohfa Scheme Latest Updates

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదింటి ఆడపిల్లల వివాహాల కోసం వారి కుటుంబాలకు బాసటగా ఉండేందుకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది. ఈ మేరకు అక్టోబర్ 1 నుంచి ఈ పథకాలను అమలు చేసేలా కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అందించనుంది. ఇక ఈ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలకై దగ్గరలోని గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని అర్హులకు సూచించింది. అలాగే సీఎం జగన్ ఆదేశాల మేరకు దీనిపై సమగ్ర సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ, వార్డు సచివాలయాలలో అందుబాటులో ఉంచనుంది.

జగన్ సర్కార్ అక్టోబర్ 1 నుంచి అమలు చేయనున్న ఈ పథకాల ద్వారా అందనున్న ఆర్ధిక సహాయం..

  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్సీలకు – రూ. 1 లక్ష
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్సీల కులాంతర వివాహాలకు – రూ.1.2 లక్షలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్టీలకు – లక్ష రూపాయలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: బీసీలకు – రూ.50వేలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: బీసీల కులాంతర వివాహాలకు – రూ.75వేలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: దివ్యాంగులు వివాహాలకు – రూ. 1.5 లక్షలు
  • వైఎస్ఆర్ కళ్యాణమస్తు: భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు – రూ.40వేలు
  • షాదీ తోఫా: మైనారిటీలకు – రూ. 1 లక్ష

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 16 =