ఏపీ ప్రెస్‌ అకాడమీ మాజీ చైర్మన్‌ శ్రీనాథ్ రెడ్డి మృతి, నివాళులర్పించిన జర్నలిస్ట్స్ అసోసియషన్

AP Press Academy Former Chairman Devireddy Srinath Reddy Passed Away,AP Press Academy Chairman Devireddy Passed Away,Former Chairman Devireddy Srinath Reddy Passed Away,Former chairman of AP Press Academy,Mango News,Mango News Telugu,AP Press Academy Ex President Devireddy Passed Away,Senior journalist Devi Reddy Srinath Reddy Passed Away,CM YS Jagan Condoles Demise of Ex-Chairman,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates,Chairman Devireddy Srinath Reddy News Today,Chairman Devireddy Srinath Reddy Live News

ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీపీఏ) మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. కాగా శ్రీనాథ్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శ్రీనాథ్ రెడ్డి 2019 నుండి సుమారు మూడు సంవత్సరాల పాటు ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన ఆయన, దాదాపు నాలుగు దశాబ్దాలుగా జర్నలిస్టుగా పనిచేశారు. ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికతో జర్నలిస్టుగా శ్రీనాథ్ రెడ్డి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో పీజీ చేసిన ఆయన, రాయలసీమ ఉద్యమంలో నాటి కాంగ్రెస్ కీలక నేతలైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి, మాజీ హోంమంత్రి ఎంవీ మైసూరా రెడ్డి తదితరులతో కలసి పనిచేశారు. ఇక శ్రీనాథ్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాగే జర్నలిస్ట్స్ అసోసియషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నివాళులర్పించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here