ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అర్హత సాధించిన వారికి త్వరలో ప్రొబేషనరీ డిక్లరేషన్‌

AP Probationary Declaration To be Given For Village and Ward Secretariat Employees by The End of June, AP govt to finalise the probation of Ward Secretariat Employees, probation process of the secretariat employees will be completed by June 30, probation of village and ward secretariat employees by the end of June, AP government issued orders to declare the probation of employees of the village ward secretariat, probation of employees of the village ward secretariat, AP Probationary Declaration, village secretariat employees, Village and ward secretariats, grama Sachivalaya Employees, Ward Secretariat Employees, secretariat employees, grama Sachivalaya Employees News, grama Sachivalaya Employees Latest News, grama Sachivalaya Employees Latest Updates, grama Sachivalaya Employees Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించింది. అర్హత సాధించిన వారికి త్వరలో ప్రొబేషనరీ డిక్లరేషన్‌ ఇవ్వబడుతుందని ప్రకటించింది. ఈ మేరకు జూన్‌ నెలాఖరు లోగా గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ల ఉద్యోగులకు ప్రొబేషన్ ప్రకటించేందుకు, అర్హులైన సిబ్బంది జాబితాను మే 16లోపు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దీనిపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జానీ పాషా హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌పై చర్యలు ప్రారంభించినందుకు సచివాలయ ఉద్యోగుల తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, సచివాలయ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ప్రక్రియను జూన్ 30 నాటికి పూర్తి చేస్తామని.. కొత్త పీఆర్సీ ప్రకారం పెంచిన జీతాలు చెల్లిస్తామని జనవరి 7న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారని జానీ పాషా గుర్తు చేశారు. జూన్ 30లోగా ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తయితే సచివాలయ శాఖ ద్వారా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సచివాలయ ఉద్యోగులతో సీఎం జగన్ కు కృతజ్ఞత సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్‌ ఎస్‌. షాన్‌ మోహన్‌ దీనిపై స్పందిస్తూ.. జూన్, 2022 నాటికి సచివాలయ సిబ్బంది అందరికీ ప్రొబేషన్ ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోందని, అయితే దీనికోసం సిబ్బంది తప్పనిసరిగా డిపార్ట్‌మెంటల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని షాన్ మోహన్ అన్నారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి 2019 అక్టోబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.20 లక్షల మంది కొత్త సచివాలయ ఉద్యోగులను నియమించింది. సిబ్బందికి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఇచ్చి, ఆ తర్వాత ఉద్యోగాలను పర్మినెంట్ చేసి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ పూర్తికావడంతో.. వారందరికీ గతేడాది సెప్టెంబర్‌ నెలాఖరున పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారిని ప్రొబేషన్‌గా నిర్ధారించి ఉద్యోగాలు పర్మినెంట్‌ చేయనున్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని వారికి మరో అవకాశం కల్పించనున్నారు. జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో సచివాలయాల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =