తెలంగాణలో వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌ పెంచిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ

Telangana Transport Dept Enhances Life Tax on Different Categories of Vehicles, Telangana Transport Dept hikes life tax on vehicles by 1%, Transport Dept Enhances Life Tax on Different Categories of Vehicles, TS Transport Dept Enhances Life Tax on Different Categories of Vehicles, New slabs proposed for different categories of vehicles, Telangana Transport Department, Telangana Transport Department Hiked Life Tax on Different Categories of Vehicles, TS Transport dept enhances life tax, life tax, Telangana Road Tax, Telangana Transport Dept Hikes Life Tax on Different Categories of Vehicles, Telangana Transport Dept Increases Life Tax on Different Categories of Vehicles, road tax in telangana, Telangana Transport Department News, Telangana Transport Department Latest News, Telangana Transport Department Latest Updates, Telangana Transport Department Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌ను పెంచింది. ఈ మేరకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మోటార్ వెహికల్ టాక్సేషన్ యాక్ట్, 1963లోని మూడు, ఆరు మరియు ఏడవ షెడ్యూల్‌లలో మోటారు వాహనాలపై లైఫ్‌ ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. దీని ప్రకారం.. రూ. 50,000 లోపు కొత్తగా కొనే ట్రైసైకిళ్లు మరియు మోటారు సైకిళ్లపై 9% లైఫ్‌ ట్యాక్స్‌ రిజిస్ట్రేషన్ సమయంలో విధించబడుతుంది. అలాగే రూ. 50,000 కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 12% వరకు విధించబడుతుంది.

మూడు, నాలుగు చక్రాల మోటారు వాహనాలను నాలుగు కేటగిరీలుగా విభజించి వాటి ధర ఆధారంగా పన్ను శ్లాబులను నిర్ణయించారు. నాన్-ట్రాన్స్‌పోర్ట్ కేటగిరీ కింద కార్లు, జీప్‌లు, 10 మంది సీటింగ్ కెపాసిటీ వరకు ఉండే ఓమ్నిబస్సులతో సహా మూడు లేదా నాలుగు చక్రాల వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌ను ఈ విధంగా నిర్ణయించారు. రూ. 5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు 13%, రూ. 5 నుంచి రూ. 10 లక్షల లోపు ఉన్న వాటిపై 14% లైఫ్ ట్యాక్స్ పడనుంది. ఇక రూ. 10 లక్షలు నుండి రూ. 20 లక్షల వరకు ధర ఉన్న వాహనాలకు 17% మరియు రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న వాటికి 18% రిజిస్ట్రేషన్ సమయంలో టాక్స్ విధించబడుతుంది.

10 సీట్ల వరకు ఉండే నాన్-ట్రాన్స్‌పోర్ట్ కేటగిరీ కింద వచ్చే కార్లు మరియు జీపులకు అనగా మనుషుల రవాణాకు కంపెనీలు లేదా సంస్థలు ఉపయోగించే కొత్త వాహనాలకు.. రూ. 5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలపై 15%, రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు ఉండే వాహనాలపై 16% టాక్స్ విధిస్తారు. అలాగే రూ. 10 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ఉండే వాహనాలకు 19% మరియు రూ. 20 లక్షల పైబడి ధర కలిగిన వాటికి 20% ట్యాక్స్‌ విధించబడుతుంది. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వాహనాల లైఫ్‌ ట్యాక్స్‌లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =