ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభ షెడ్యూల్ లో మార్పులివే…

AP Schools Reopen, AP Schools Reopen News, AP Schools Reopen Schedule, AP Schools Reopen Updates, AP Schools reopening, AP schools reopening 2020, AP Schools Reopening News, AP Schools Reopening Postponed, Classes for 8th Class Students Start From Tomorrow In AP, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్‌ 2 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి దశలో భాగంగా నవంబర్‌ 2 వ తేదీ నుంచి 9,10 విద్యార్థులకు తరగతులును రోజు విడిచి రోజు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగతా తరగతులకు పాఠశాలల పునఃప్రారంభ షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముందుగా నవంబర్ 23 నుంచి 6, 7, 8 విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే రేపటి నుండి రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో కేవలం 8వ తరగతి విద్యార్థులకే తరగతులు ప్రారంభం కానున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.

అలాగే రేపటి నుంచి 8,9 విద్యార్థులకు రోజు విడిచి రోజు హాఫ్‌ డే వరకు తరగతులు జరగనుండగా, 10 వ తరగతి విద్యార్థులు మాత్రం ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇక డిసెంబర్ 14 నుంచి 6, 7 విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × four =