టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలకు పెరుగుతున్న ఆదరణ, ఏడాదిలో రూ.46 కోట్లు ఆదాయం

Mango News, Minister Puvvada Ajay Kumar about TSRTC Cargo, Parcel Services on Completion of 1 Year, RTC cargo services, telangana government, Transport Minister, Transport Minister congratulates TSRTC Cargo Service, Transport Minister Puvvada Ajay Kumar, TSRTC Cargo, TSRTC Cargo Parcel Services, TSRTC Cargo Parcels, TSRTC Cargo Parcels Home Delivery Services, TSRTC Cargo Service, TSRTC Cargo Services, TSRTC gets Rs 46 crore through cargo

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మానస పుత్రికగా దిన దినాభివృద్ధి చెందుతూ, అతి తక్కువ సమయంలోనే టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారుల ఆదరణ చూరగొనటం సమష్టి కృషితోనే సాధ్యమైందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సరికొత్త ఆశయం, ఆకాంక్షలతో టీఎస్ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల్ని ప్రారంభించి జూన్ 19 నాటికి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా ఉద్యోగుల నుంచి ఈడీలవరకు, ఏజెంట్ల నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ల వరకు అందరినీ అభినందిస్తూ మంత్రి పువ్వాడ అజయ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్గో, పార్శిల్ సేవల్ని వినియోగిస్తున్న వినియోగదారులకు కూడా ప్రత్యేకంగా మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, టిఆర్ అండ్ బి ముఖ్య కార్యదర్శి, సంస్థ ఎం.డి సునీల్ శర్మ మార్గనిర్దేశంలో కార్గో, పార్శిల్ సర్వీసులు ప్రత్యేక అధికారిగా ఎన్. కృష్ణకాంత్ పర్వవేక్షణలో అందిస్తున్న సేవలు సంవత్సర కాలంలోనే వినియోగదారులకు మరింత చేరువగా నిలిచాయంటూ వారిని మంత్రి పువ్వాడ ప్రశంసించారు.

ఏడాదిలో రూ.46 కోట్లు ఆర్జన :

కార్గో, పార్శిల్ సేవలు ప్రారంభిన నాటి నుంచి నేటి వరకు 32 లక్షల పార్శిల్స్ కేవలం సర్వీసు బస్సుల ద్వారా చేరవేసి రూ.34 కోట్లు, ఆపై కార్గో బస్సుల ద్వారా రూ.12 కోట్లు అంటే మొత్తం రూ.46 కోట్లు ఆర్జించడం హర్షనీయమన్నారు. ఇతర ట్రాన్స్ పోర్టుల కంటే తక్కువ ధర ఉండటం, పార్శిల్స్ బుక్ చేసిన కొద్ది గంటల్లోనే సమీప ప్రాంతాలకు చేరవేస్తూ నమ్మకాన్ని చూరగొంటోందన్నారు. 177 బస్ స్టేషన్ కౌంటర్లు, 810 ఏజెంట్లతో కొనసాగుతున్న కార్గో, పార్శిల్ సేవలను మరింత విస్తరించే క్రమంలో రాష్ట్రంలోని ఇతర పట్టణాలలో కూడా హెూం డెలివరీ సౌకర్యాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. జంటనగరాలలో హెూం డెలివరీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని, వేగంగా, భద్రంగా, మరింత చేరువగా సేవలు అందిస్తుండటంతో వినియోగదారుల ఆదరణ లభిస్తోందన్నారు.

సంస్థకు కండక్టరు, డ్రైవర్లే నిజమైన రథ సారధులు:

టీఎస్ ఫుడ్స్, హార్టికల్చర్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, టీఎస్ టెక్స్ట్ బుక్స్, ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్, సివిల్ సప్లయ్, ఫెర్టిలైజర్స్, ఆరోగ్య శాఖ, తదితర ప్రభుత్వ శాఖలు, హెరిటేజ్, బిస్లరీ, వాసు ఫార్మసిటికల్స్, దివ్య ఫార్మసిటికల్స్, స్వామీ అండ్ సన్స్, తదితర ప్రైవేట్ కంపెనీల సరుకు రవాణా కూడా టీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా కొనసాగుతున్నాయన్ని తెలిపారు. సంస్థకు కండక్టరు, డ్రైవర్లే నిజమైన రథ సారధులని, ఎంతో కష్టపడి పని చేసే సిబ్బంది, ఉద్యోగులను ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ ఆర్థిక స్థితిని గాడిన పెట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వినియోగదారులు పార్శిల్, కార్గో సేవల్ని మరింత ఆదరించి సంస్థ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =