వైసీపీ ఫస్ట్‌ లిస్ట్‌ రెడీ.. మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాలు

CM Jagan Likely To Release The First List of MLA Candidates For YSRCP in 2024 Elections Soon,CM Jagan Likely To Release The First List,First List of MLA Candidates,YSRCP in 2024 Elections Soon,Mango News,Mango News Telugu,Vallabhaneni Vamsi, Karanam Venkatesh, Rapaka Varaprasad, Nedurumalli Ram Kumar Reddy , Adala Prabhakar Reddy, Mekapati Rajagopal Reddy,CM Jagan Latest News,CM Jagan Latest Updates,AP CM YS Jagan Mohan Reddy,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభించారు. దసరా వేళ తొలి జాబితా విడుదలకు ఛాన్స్ కనిపిస్తోంది. మూడు విడతలుగా అభ్యర్థుల జాబితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా పార్టీలో నేతల వారసులకు టికెట్ల విషయంపై చర్చ సాగుతోంది. దీనిపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో, తొలి జాబితాలో ఉండే వారి పేర్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం నిలబెట్టుకోవాలని సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు కొనసాగిస్తున్నారు. దసర వేళ తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తొలి జాబితాలో 2019 విజయం తరువాత పార్టీకి దగ్గరైన ఇతర పార్టీల ఎమ్మెల్యేల స్థానాలతో పాటుగా అభ్యర్థులను మార్చే స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, చీరాల నుంచి కరణం వెంకటేష్, రాజోలు నుంచి రాపాక వరప్రసాద్, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పేర్లతోపాటుగా ఇప్పటికే ఖరారు చేసిన వారి పేర్లు.. సిట్టింగుల స్థానాల్లో మార్పు చేసే వారితో జాబితా విడుదల కానుంది. ఈ సారి ఎమ్మెల్యేల పనితీరుపై పలు మార్గాల్లో చేసిన ఏడు సర్వేల నివేదికల ఆధారంగా సిట్టింగులకు అవకాశం.. కొత్త అభ్యర్థుల ఖరారుపైన సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. సామాజిక – ప్రాంతీయ సమీకరణాలు కీలకం కానున్నాయి. ఈ సారి టికెట్ల కేటాయింపులో మహిళలు.. బీసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ప్రతీ నియోజకవర్గంలోనూ జగన్ పూర్తి స్థాయిలో అధ్యయనం.. సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ప్రకటించనున్నారు. సిట్టింగులను మార్చే సీట్లపైనా తొలి జాబితాలోనే క్లారిటీ ఇవ్వనున్నారు. దాదాపు 27 మంది అభ్యర్థులను మారుస్తారని పార్టీ ముఖ్య నేతల సమాచారం. సీట్లు దక్కని వారితో మాట్లాడి..వారి భవిష్యత్‌పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కొత్త అభ్యర్థులను ముందుగానే ప్రకటించటం ద్వారా వారు ప్రజలతో మమేకం కావటం.. నియోజకవర్గాల్లో ఎదురయ్యే అసంతృప్తులను అధిగమించవచ్చని భావిస్తున్నారు. ఇక, వారసులకు టికెట్ల విషయంలోనూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి సీనియర్లనే బరిలోకి దింపాలని నిర్ణయించారు. అనారోగ్య కారణాలు.. పోటీ చేయలేని పరిస్థితుల్లో మాత్రం మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చేలా నిర్ణయాలు ఉండవని తేల్చి చెబుతున్నారు. ఎన్నికల వేళ కీలక బాధ్యతలు.. నామినేటెడ్ పదవుల్లోనూ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా నియామకాలు పూర్తి చేయనున్నారు. ఈ వారంలో కీలక నిర్ణయాల దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. దీంతో, ఎమ్మెల్యే సీట్లు.. పదవులు ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ కొనసాగుతోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =