100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, ఇకపై గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలు, తగాదాలు ఉండరాదు – సీఎం జగన్

CM Jagan Held Review Meet on Jagananna Permanent Land Rights and Land Protection Scheme Today, Ap Conducting Survey After 100 Years, No More Land Disputes And Fights Ap, CM Jagan On Land Survey, Mango News, Mango News Telugu, AP Land Resurvey, BHU Survey Helps Resolve Land Disputes, AP CM YS Jagan Mohan Reddy, AP Land Registration At Village Level, Govt Launches Comprehensive Land Survey, Jagananna Saswatha Bhu Hakku, Resurvey In A.P. In Telugu, Meebhoomi, Resurvey Of Land In Andhra Pradesh, Andhra Pradesh Resurvey, Resurvey Of Land In AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నామని, భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపడమే దీని ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ‘జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, సీఎం అడ్వైజర్ అజేయ కల్లం, ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

‘జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకంపై సమీక్షలో సీఎం జగన్ చేసిన కొన్ని కీలక సూచనలు..

  • 100 ఏళ్ల తర్వాత సర్వే చేస్తున్నాం, దీనిలో మనదైన ముద్ర కనిపించాలి.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై ఎలాంటి భూ వివాదాలు, తగాదాలు లేని గ్రామాలు కనిపించాలి.
  • రీ సర్వే పేరుతో రాష్ట్రంలో మహా యజ్ఞమే ప్రారంభించాం, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవాలి.
  • మొబైల్ ట్రిబ్యునల్స్, సరిహద్దులు, సబ్ డివిజన్స్ వారీగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి.
  • ఈ సర్వే వల్ల భూమికి సంబంధించిన రికార్డులు, డేటా స్పష్టంగా ఉంటుంది, తద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతుంది.
  • అలాగే ఈ సర్వే నిర్వహణకు కోట్లాది రూపాయలతో పరికరాలు కొనుగోలు చేశాం, వేల మంది సిబ్బందిని నియమించుకున్నాం.
  • గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే పూర్తయిన అనంతరం రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి.
  • అలాగే సర్వే పూర్తయిన తర్వాత ప్రతి గ్రామంలో ఆర్డీవోలు, జేసీలు భూములకు సంబంధించిన హక్కు పాత్రలను తనిఖీ చేయాలి.
  • దీంతోపాటు అర్బన్ ప్రాంతాల్లోనూ సర్వే చేపట్టాలని, మొత్తం 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 15,02,392 ఎకరాల్లో సర్వే చేపట్టాలి.
  • ఇక సీఎం జగన్ ఆదేశాలపై స్పందించిన అధికారులు 2023 జనవరి నుంచి సర్వే ప్రక్రియ మొదలెట్టి ఆగస్టు నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =