ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో రెండేళ్ల వయోపరిమితి పెంపుకు ఆమోదం

CM YS Jagan Gives Green Signal To Two Years Age Relaxation For Police Recruitment in AP,Ap Constable Apply Online 2022,Constable Notification 2022 Ap Last Date,Ap Constable Notification 2022,Apslprb,Mango News,Mango News Telugu,Ap Constable Age Limit 2022,Ap Police Si Notification 2022,Ap Police Constable Selection Process,Ap Constable Syllabus,Ap Constable Apply Online 2022,Constable Notification 2022 Ap Last Date,Ap Constable Notification 2022,Apslprb,Ap Constable Age Limit 2022,Ap Police Si Notification 2022,Ap Govt Constable Notification,Ap Constable Posts,Ap Constable Posts Notification 2021

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అభ్యర్థుల వయో సడలింపుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్‌మెంట్ వయోపరిమితిని రెండేళ్లు సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇటీవల కానిస్టేబుల్ ఉద్యగార్ధులు వయోపరిమితి పెంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ సీఎంఓ అధికారులను కలిసి విన్నవించుకున్నారు. అనంతరం వారి అభిప్రాయాన్ని అధికారులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 6,511 పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. దీనికి సంబంధించి ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం వీటిలో 411 ఎస్‌ఐ పోస్టులు, మరో 6,100 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఇక ఎస్‌ఐ పోస్టుల్లో 315 సివిల్ (పురుష, మహిళా కేటగిరీలు), 96 ఏపీఎస్పీ (పురుష) పోస్టులు ఉండగా.. కానిస్టేబుల్ పోస్టుల్లో 3,580 సివిల్, 2,520 ఏపీఎస్పీ పోస్టులు ఉన్నాయి. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు సీఎం జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కోరిక మేరకు వయోపరిమితి పెంచినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − one =