విశాఖలో టీడీపీ వ్యూహాలు ఈసారి అయినా ఫలిస్తాయా?

Visakha, TDP, Chandrababu naidu, Lok sabha elections, Y S Jagan Mohan Reddy, MLA Vasuapalli Ganesh Kumar, YSRCP,JSP, Nara Chandrababu Naidu, Andhra Pradesh, Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News, Mango News Telugu
Visakha, TDP, Chandrababu naidu, Lok sabha elections

విశాఖ పార్లమెంట్ సీటును దక్కించుకోవాలని దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా టీడీపీ కల నెరవేరలేదు. టీడీపీ ప్రయత్నాలన్నీ విశాఖలో బెడిసి కొడుతున్నాయి. ఇప్పటి వరకు విశాఖ పార్లమెంట్ స్థానానికి 10 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కేవలం మూడు సార్లు మాత్రమే విశాఖలో టీడీపీ జెండా ఎగిరింది. అది కూడా రెండుసార్లు దివంగత నేత ఎన్టీఆర్ హయాంలోనే. చంద్రబాబు హయాంలో ఒకే ఒక్కసారి విశాఖలో తెలుగు దేశం పార్టీ గెలుపొందింది. ఈక్రమంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా విశాఖ స్థానాన్ని దక్కించుకోవాలని తెలుగు దేశం పార్టీ పావులు కదుపుతోంది.

1984లో విశాఖ నుంచి తెలుగు దేశం పార్టీ తరుపున భాట్టం శ్రీరామమూర్తి బరిలోకి దిగారు. ఆ సమయంలో ఆయన గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన బరిలోకి దిగినప్పటికీ ఓటమిపాలయ్యారు. తిరిగి 1999లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మరోసారి శ్రీరామమూర్తి విశాఖ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం ఆరు సార్లు శ్రీరామమూర్తి విశాఖ నుంచి పోటీ చేయగా.. కేవలం రెండుసార్లు మాత్రమే గెలుపొందారు. ఇక 2004, 2009లో టీడీపీ విశాఖలో ఓడిపోయింది.

2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగిన తెలుగు దేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో మూడోసారి విశాఖలో టీడీపీ జెండా ఎగిరింది. ఇక 2019లో టీడీపీ ఒంటరిగానే పోటీ చేసింది. శ్రీరామమూర్తి మనవడు శ్రీభరత్‌ను 2019 ఎన్నికల్లో టీడీపీ బరిలోకి దింపింది. కానీ ఆయన కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతోనే ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా విశాఖ నుంచి గెలుపొందాలని తెలుగు దేశం పార్టీ పావులు కదుపుతోంది. ఈక్రమంలో మరోసారి శ్రీభరత్‌నే విశాఖ నుంచి బరిలోకి దింపాలని టీడీపీ హైకమాండ్ భావిస్తోందట.

2019లో తక్కువ ఓట్లతో ఓడినప్పటికీ ఈసారి ఎలాగైనా గెలుపొందాలని పట్టుదలతో ఉన్నారట శ్రీభరత్. అటు హైకమాండ్ కూడా తనకే టికెట్ ఇస్తుందని భావించి ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టారట. విశాఖ లోక్ సభ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారట. మరోవైపు అటు వైసీపీ హైకమాండ్ కూడా విశాఖ లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది. రెండోసారి విశాఖను దక్కించుకోవాలని పావులు కదుపుతోంది. అందుకే ఈసారి మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని బరిలోకి దింపుతోంది. మరి ఈ పరిస్థితుల మధ్య ఈసారి అయినా విశాఖ టీడీపీకి దక్కుతుందా? లేదా? చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =