అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయాలు, తొలిరోజునే 17 ఆదేశాలపై సంతకాలు

2021 US Inauguration Day, Joe Biden, Joe Biden 46th President, Joe Biden Becomes 46th US President, Joe Biden Latest News, Joe Biden Signs On 17 Executive Orders on First Day, Joe Biden sworn-in 46th President, Kamala Harris, Mango News, United States of America, US President Joe Biden, US President Joe Biden Signs On 17 Executive Orders, USA

అమెరికా 46వ అధ్యక్షుడిగా జనవరి 20, బుధవారం నాడు జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. కాగా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే జో బైడెన్ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. తొలిరోజున జో బైడెన్‌ మొత్తం 17 కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకాలు చేశారు. గతకొంత కాలంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకొచ్చిన పలు ఆదేశాలను జో బైడెన్ వెనక్కి తీసుకున్నారు. ప్రజలకు మేలు చేసేందుకే ఇమ్మిగ్రేషన్, వాతావరణ మార్పు, జాతి వివక్ష నిర్మూలన మరియు కరోనావైరస్ మహమ్మారి నియంత్రణ విధానంపై ట్రంప్ తెచ్చిన పాలసీలను వెనక్కు తీసుకున్నట్టు ప్రకటించారు.

జో బైడెన్ సంతకం చేసిన కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ (కార్యనిర్వాహక ఆదేశాలు):
  • పారిస్‌ వాతావరణ ఒప్పందం (క్లైమెట్ చేంజ్) లో అమెరికాను మళ్ళీ భాగస్వామ్యం చేస్తూ నిర్ణయం.
  • విద్యార్థుల రుణ విరామం గడువు పొడిగించడం.
  • ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధం ఎత్తివేత.
  • 100 డేస్ మాస్క్ ఛాలెంజ్.
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తో అమెరికా మళ్ళీ కలిసి నడవడం.
  • మెక్సికోతో సరిహద్దు గోడ పని నిలిపివేత.
  • కరోనా వైరస్ పై జాతీయ ప్రతిస్పందనను సమన్వయం చేయడానికి కొత్త ఫెడరల్ ఆఫీస్ ఏర్పాటు.
  • అమెరికాలో జాతి వివక్ష నిర్మూలన లక్ష్యంగా పలు వర్గాలకు సమానహక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు.
  • పిల్లలుగానే అమెరికాకు వచ్చి స్థిరపడిన లక్షలాది మంది ప్రజలకు మేలు చేసేలా శాశ్వత నివాసం లేదా పౌరసత్వం కల్పించేలా నిర్ణయం.
  • గ్రీన్‌ కార్డుల ఇచ్చే విషయంలో దేశాల ప్రకారం ఉన్న పరిమితి ఉపసంహరిస్తూ నిర్ణయం.
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 6 =