ఉత్తరాంధ్రలో హై అలెర్ట్ – జవాద్ ఎఫెక్ట్

Andhra pradesh Jawad Cyclone Update,Mango News, Mango News Telugu,ap cyclone updates,Andhra Pradesh Cyclone Updates,cyclone jawad latest update,ap cyclone Jawad effect, cyclone jawad speed,cyclone jawad in andhra pradesh,cyclone jawad imd,cyclone jawad imd Updates,cyclone jawad current status,Jawad Cyclone,Jawad IMD issues red alert,Jawad Cyclone Red Alert,AP Cyclone Jawad Red Alert,Ap Live Updates,Ap Alerts, Ap Updates,Cyclone 'Jawad' Alert In Andhra's,Cyclone Jawad To Hit Andhra Pradesh

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమేపీ బలపడి తుఫాన్ గా మారింది. దీనికి జవాద్ అని నామకరణం చేసారు. ఇది విశాఖకు 650 కి.మీ.. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం 32 కి.మీ వేగంతో ముందుకు కదులుతుంది. శనివారం ఉదయానికి ఉత్తరాంధ్ర, ఒడిస్సా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ కమీషనర్ కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి జల్లులు నుంచి ఓ మోస్తరు వర్షాలు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని తెలిపారు.

ఈ అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు ఉదయం నుంచి గంటకు 70-90 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, రెవిన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున అధికారులకు సూచించారు. తుఫాన్ సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్ఎఫ్, 55 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేసినట్లు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =