గులాబ్ తుఫాన్ పరిస్థితిపై సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడిన ప్రధాని మోదీ

Cyclone Gulab, Cyclone Gulab News, Cyclone Gulab Updates, Gulab Cyclone, Mango News, PM Modi Assures Support To Odisha Andhra, PM Modi Makes Phone Call to AP CM YS Jagan, PM Modi speaks to Andhra Pradesh CM Jagan Mohan Reddy, PM Modi Speaks to AP CM YS Jagan, PM Modi Speaks to AP CM YS Jagan about Gulab Cyclone, PM speaks to AP CM about Cyclone Gulab

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై గులాబ్ తుఫాన్ ప్రభావం, పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. “గులాబ్ తుఫాన్ పరిస్థితి గురించి సీఎం వైఎస్ జగన్ తో మాట్లాడాను. కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చాను. అందరు క్షేమంగా వుండాలని ప్రార్ధిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరోవైపు శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడి గులాబ్‌ తుపానుగా మారిన సంగతి తెలిసిందే. కాగా గులాబ్‌ తుపాను ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం–గోపాలపూర్‌ మధ్య తీరం దాటింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 75 నుంచి 85 కి.మీ వేగంతో గాలులు వీచాయి. గులాబ్‌ తుపాను ప్రభావంతో శనివారం రాత్రి నుంచే రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు సహా ఇతర జిల్లాల్లో కూడా తుఫాన్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ రోజుతో పాటు రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇక తుఫాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులను అప్రమత్తం చేసి, ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − eight =