ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రగా ప్రకటించి, 25 రాజధానులకు వెళ్లండి: పవన్ కళ్యాణ్

Declare AP as United States of Andhra and Go for 25 Capitals Janasena Chief Pawan Kalyan Counter to YCP Govt, Declare AP as United States of Andhra, Go for 25 Capitals, Janasena Chief Pawan Kalyan Counter to YCP Govt, Mango News, Mango News Telugu, Pawan Kalyan Janavani Program, Vizag Janavani Program, Janasena Chief Pawan Kalyan Vizag Tour, Janasena Party, Janasenani AP, AP Janasena Chief Pawan Kalyan, Pawan Kalyan Vizag Janavani Program, Janavani Program Latest News And Updates

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీలోని అధికార వైసీపీపై ధ్వజమెత్తారు. ఏపీని ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ ఆంధ్ర’గా ప్రకటించాలని పవన్‌ కళ్యాణ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్ చేశారు. “వికేంద్రీకరణ అనేది సర్వతోముఖాభివృద్ధికి మంత్రమని వైసీపీ భావిస్తే, ఏపీకి మూడు రాజధానులకే ఎందుకు పరిమితం చేయాలి? ఏది ఏమైనప్పటికీ వైసీపీ వారు చట్టం, న్యాయవ్యవస్థ మరియు రాజ్యాంగానికి అతీతంగా ఉన్నట్లు విశ్వసిస్తారు మరియు ప్రవర్తిస్తారు, మరియు మిగిలిన పౌరులు ఏమి భావిస్తున్నారో లేదా చెప్పేదానిని వారు ఒక్క పైసా కూడా పట్టించుకోరు” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

“అలాగే ఏపీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర గా ప్రకటించి, 25 జిల్లాలను రాష్ట్రాలుగా ప్రకటించి, 25 రాజధానులకు వెళ్లండి. ఏపీని మీ వైసీపీ రాజ్యంగా మార్చుకోండి మరియు దయచేసి సంకోచించకండి” అని పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. సోమవారం కూడా ‘దేనికీ గర్జనలు’ అంటూ పవన్‌ కళ్యాణ్ పలు అంశాలపై ట్వీట్స్ చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ట్వీట్లపై పలువురు మంత్రులు, వైసీపీ నాయకులు ఘాటుగానే ప్రతిస్పందించారు. ఈ క్రమంలో పవన్‌ కళ్యాణ్ మరోసారి మూడు రాజధానుల అంశంపై స్పందించడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + nine =