వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటాం, సాధించే సీట్లను బట్టే సీఎం పదవి – జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌

Janasena Chief Pawan Kalyan Sensational Comments on Alliances and CM Post in The Next Elections in AP,Janasena Chief Pawan Kalyan,Pawan Kalyan Sensational Comments on Alliances,Pawan Kalyan Sensational Comments on CM Post,Mango News,Pawan Kalyan Comments on CM Post in The Next Elections in AP,CM Post in The Next Elections in AP,Janasena Chief Pawan Kalyan Latest News And Updates,Pawan Kalyans Sensational Comments On Getting CM Post,Pawan Kalyan Comments On Jagan Post

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం మరియు ముఖ్యమంత్రి పదవి ఆశించడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎదుర్కొనేందుకు బలం ఉన్న పార్టీలతో కలిసి నడవాలని భావిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి వైసీపీ ప్రభుత్వం రానివ్వకూడదనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్‌ పార్టీలను గౌరవిస్తానని, అయితే ఎన్నికల్లో ప్రభావం చూపించే ప్రధాన పార్టీలతోనే వైసీపీని మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలమని, అందుకే కలిసివచ్చే పార్టీలతో ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని తేల్చి చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మాటల్లోనే..

  • వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న మాటకు కట్టుబడి ఉన్నా.
  • పొత్తులు అనేవి కులానికి సంబంధించినవి కావని.. రాష్ట్రానికి సంబంధించినవి.
  • నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం.. దానిని దృష్టిలో పెట్టుకునే పొత్తులపై అడుగులు.
  • జనసేన గౌరవానికి భంగం కలగకుండా పొత్తుల విషయంలో ముందుకెళ్తాం.
  • గతంలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ వంటి పార్టీలు పొత్తులతోనే బలపడ్డాయనే సంగతి గుర్తుంచుకోవాలి.
  • నేను సీఎం అభ్యర్థి అయితేనే పొత్తులకు సిద్ధమని కొంతమంది చెబుతున్న మాటలను ఖండిస్తున్నా.
  • గత ఎన్నికలతో పోలిస్తే మా బలం డబుల్‌ అయ్యింది.
  • అప్పుడు జనసేన పార్టీకు సగటున 7 శాతం ఓట్లు రాగా, ఈసారి ఆ బలం 18-19 శాతానికి పెరిగింది.
  • గత ఎన్నికల్లో కనీసం 40 సీట్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు బలంగా ఉండేవాళ్ళం.
  • అప్పుడు సీఎం పదవి డిమాండ్ చేయడానికి వీలుండేది.
  • కర్ణాటకలో కేవలం 30 సీట్లతో కుమారస్వామి గౌడ ముఖ్యమంత్రి అయ్యారు.
  • అలాగే వచ్చే ఎన్నికల్లో 30-40 సీట్లలో గెలిపించినా సీఎం పదవి డిమాండ్‌ చేస్తా.
  • 2014లో కూడా అన్నీ అధ్యయనం చేసిన తరువాతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం.
  • నన్ను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీని, టీడీపీని అడగను.. నా సత్తా ఏంటో చూపించాకే పదవి అడుగుతా.
  • కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి సాధించలేం.. కష్టపడి పనిచేస్తే పదవి దానంతట అదే వస్తుందని నమ్ముతాను.
  • సినిమాల్లో నన్నెవరూ సూపర్‌ స్టార్‌ను చెయ్యలేదు.. నా టాలెంట్ చూపించుకుని నేనే ఆ స్థానం సాధించుకున్నా.
  • అలాగే రాజకీయాల్లో కూడా నా సత్తా చూపించే సీఎం పదవి సాధిస్తా.
  • పొత్తుల విషయంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, స్థానాల సర్దుబాటు అనేది ఆయా పార్టీల బలంపై ఆధారపడి ఉంటుంది.
  • పట్టున్న ప్రాంతాల్లో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుంది, తక్కువగా ఉన్నచోట్ల మిత్ర పక్షాలను సపోర్ట్ చేస్తాం.
  • వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ ఏర్పాటు చేయలేదు, ప్రజలకు మంచి చేసేందుకే వచ్చా.
  • వైసీపీ నుంచి అధికారం తీసేసుకుని ప్రజలకు అధికారం అప్పగించడమే మా ఏకైక లక్ష్యం.
  • పొత్తులకు కొన్ని పార్టీలు ఒప్పుకోకుంటే ఒప్పించి ముందుకు సాగుతాం.
  • ఏపీలో ఎర్లీ ఎలక్షన్స్‌ ఉండొచ్చని అంటున్నారు.. అందుకే జూన్‌ నుంచి ఇక్కడే అందుబాటులో ఉంటా.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =