అంబటి రాంబాబుపై భగ్గుమంటోన్న అసమ్మతి నేతలు

Dissent Leaders Who Are Divided Over Ambati Rambabu, Dissent Leaders, Divided Over Ambati Rambabu, Ambati Rambabu, AP Politics, YCP, CM Jagan, AP Assembly Elections, Latest Ambati Rambabu Political News, Ambati Rambabu Political News Update, Andra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Ambati Rambabu, AP Politics, YCP, CM Jagan, AP Assembly Elections

సంక్రాంతి పండుగ వేళ సంబరాల రాంబాబుగా మారారు మంత్రి అంబటి రాంబాబు. తన నియోజకవర్గమైన సత్తెనపల్లిలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈక్రమంలో భోగి మంటలు వెలిగించి రాంబాబు చిందులేశారు. తన రెండు సాంగ్‌లకు డ్యాన్స్ చేస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ప్రస్తుతం అంబటి రాంబాబు డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇదే సమయంలో సొంత పార్టీ నేతల నుంచే రాంబాబుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అసమ్మతి నేతలను బుజ్జగించకుండా చిందులేయడంపై రాంబాబుపై పెద్ద ఎత్తున విమర్శలొస్తున్నాయి.

అంబటి రాంబాబు వీడియోలు వైరల్ కావడంతో.. ఆయనపై అసంతృప్తితోవున్న నేతలంతా మీడియో మాట్లాడారు. ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా  కొందరు సొంత పార్టీ నేతలు సంబురాల రాంబాబు మాకొద్దంటే వద్దు అని తేల్చి చెబుతున్నారు. రాంబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ ఇస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎట్టిపరిస్థితిలో సత్తెనపల్లి టికెట్ అంబటి రాంబాబుకు ఇవ్వొద్దని అంటున్నారు.

నందిగామ ఎంపీటీసీ సయ్యద్ సీమా భర్త రఫి, కొమెరపూడి గ్రామ సర్పంచ్ కొరివి అనిల్.. అలాగే వైసీపీ నేతలు వెన్నా వెంకటరెడ్డిలు అంబటికి వ్యతిరేకంగా తమ గళం విప్పారు. సత్తెనపల్లి టికెట్ ఈసారి అంబటి రాంబాబుకు ఇవ్వొద్దని కోరారు. అనుచరుల్ని ముందుంచి అంబటి రాంబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని.. సర్పంచ్‌లను తెగ ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. అక్రమంగా మైనింగ్ చేపట్టి కోటనెమలిపురి సరిహద్దుల్నే అంబటి మార్చేశారని అన్నారు. గడప గడప ప్రోగ్రాంలో సొంత పార్టీ నేతలే పాల్గొనకుండా అడ్డుపడ్డారని చెప్పుకొచ్చారు.

అయితే అంబటికి టికెట్ ఇవ్వొద్దని బహిరంగంగా కోరిన వారు 25 మంది నేతల వరకు ఉన్నారు. ఇక బయటికి రాని వారు ఎంత మంది ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది. అటు జగన్ నిర్వహించిన సర్వేల్లో కూడా సత్తెనపల్లిలో అంబటిపై వ్యతిరేకత పెరిగిపోయిందని.. ప్రజా బలం తగ్గిపోయిందని తేల్చాయి. ఈక్రమంలో అంబటికి హైకమాండ్ ఈసారి టికెట్ ఇస్తుందా..? లేదా పక్కన పెడుతుందా..? అన్నది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − ten =