నంద్యాలలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్

Ex-Minister Bhuma Akhila Priya Arrested in Allagadda Today Amid Allegedly Attack on TDP Leader AV Subbareddy,Ex-Minister Bhuma Akhila Priya Arrested,Bhuma Akhila Priya Arrested in Allagadda,Bhuma Akhila Priya Arrested in Allagadda Today,Mango News,Mango News Telugu,Former Minister Bhuma Akhilapriya detained in Allagadda,Allegedly Attack on TDP Leader AV Subbareddy,Supporters of Bhuma Akhila Priya allegedly attacks,Ex-Minister Bhuma Akhila Priya,Ex-Minister Bhuma Akhila Priya Latest News,Ex-Minister Bhuma Akhila Priya Latest Updates,TDP Leader AV Subbareddy,AV Subbareddy Latest News And Updates

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు వెలుగుచూశాయి. టీడీపీలోని రెండు వర్గాల మధ్య చిచ్చు రాజుకుంది. ఈ ఘటన నంద్యాల మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి లోకేష్ పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ వర్గీయులు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో దాడి ఘటనపై ఆయన నంద్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అఖిల ప్రియతో పాటు మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో అరెస్ట్ చేశారు. అలాగే ఆమె భర్త భార్గవ్ రామ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం భూమా దంపతులను ప్రత్యేక వాహనంలో నంద్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అసలేమైందంటే.. కాగా ఆళ్లగడ్డ రాజకీయాల్లో ఆయనకు 35 ఏళ్ల అనుభవం ఉంది. అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరూ ప్రాణ స్నేహితులు. అయితే నాగిరెడ్డి మరణానంతరం అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య సఖ్యత కొరవడింది. ఈ క్రమంలో నిన్న లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఇరువురు నేతలూ బలప్రదర్శనకు దిగారు. ఈ సమయంలో అఖిల ప్రియ, సుబ్బారెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా.. భూమా అనుచరులు అనుచరులు కొందరు ఆయనపై దాడి చేశారు. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. అయితే ఏవీ సుబ్బారెడ్డి కూడా అదే సీటుపై వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భూమా వర్గీయులకు, ఏవీ అనుచరులకు మధ్య ఇటీవల తీవ్ర ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =