నేడు ఏపీ కేబినెట్ భేటీ.. విశాఖ రాజధాని, అసెంబ్లీ సమావేశాలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న మంత్రివర్గం

AP State Cabinet Meeting To be Held Today Chaired by CM Jagan Likely To Discuss on Several Key Issues,AP State Cabinet Meeting,Jagan Chaired Cabinet Meeting,AP Cabinet Meeting,Mango News,Mango News Telugu,Increase of Pensions,Pensions Increase To Rs 2750,AP Cabinet Meeting Latest News and Updates,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy, YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లోని కేబినెట్ మీటింగ్ హల్ లో ఈరోజు ఉదయం 11గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా నిన్న సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన ఏపీ స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఆమోదించిన సుమారు రూ.1లక్షా 45వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి భారీ ప్రాజెక్టులను మంత్రి మండలి ఆమోదించనుంది. అలాగే విశాఖపట్నంలో జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుపై కేబినెట్ ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. కాగా, విశాఖపట్నం రాజధానిపై సీఎం జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే తాను కూడా అక్కడినుంచే పరిపాలన సాగిస్తానని స్పష్టం చేసిన నేపథ్యంలో రాజధానిని విశాఖకు మార్చడంపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా మంత్రి మండలి చర్చించనుందని సమాచారం. ఇక రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపుపై కూడా చర్చించనున్నారు. ఇంకా సాంఘిక సంక్షేమ శాఖ అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల మార్గదర్శకాల్లో మార్పులపై తగిన నిర్ణయం తీసుకోనున్నారు. కాగా టీడీడీకి సంబంధించి విధానపరమైన నిర్ణయాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రవాణా శాఖతో పన్నుల పెంపుతో పాటు ఇప్పటికే జీఓలు జారీ చేసిన పలు అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. ఇంకా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, పోర్టులు, కడప స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై మంత్రివర్గంలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ల పంపిణీపై కూడా మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − one =