వచ్చే ఎన్నికల్లో జనసేన-బీజేపీ కలిసే పోటీ చేస్తాయి, టీడీపీతో పొత్తు ఉండదు – ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్

AP BJP Incharge Sunil Deodhar Announces No Chance of Alliance Between TDP and BJP in Next Elections, AP BJP Incharge Sunil Deodhar, TDP and BJP Alliance, TDP Chief Chandrababu Naidu, Janasensa Chief Pawan Kalyan, BJP Andhra Chief Somu Verraju, Mango News, Mango News Telugu, TDP, JSP, Bjp Party, Jana Sena Party, Barthita Janatha PArty, Janasena Chief Pawan Kalyan News And Live Updates, No Chance of Alliance Between TDP and BJP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు దాదాపు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే అప్పుడే పొత్తులకు సంబంధించిన అంశంపై రోజుకో వార్త వినిపిస్తోంది. ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందేమో అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్ పొత్తుల వ్యవహారంపై స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో నమ్మకంతో ఓటు వేసిన ప్రజలను వైఎస్సార్సీపీ వంచించిందని, రాష్ట్రంలో అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనిపించట్లేదని విమర్శించారు.

అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటు వేయరని, బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంటుందని సునీల్ దేవధర్ స్ఫష్టం చేశారు. చాలా కాలం నుంచి తాము కలిసి పనిచేస్తున్నామని, రెండు పార్టీల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తేల్చి చెప్పారు. జనసేన, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని, పవన్ కళ్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ పైన పార్టీలో చర్చించిన మీదట వెల్లడిస్తామని తెలిపారు. ఇక టీడీపీతో బీజేపీకి ఎలాంటి పొత్తు ఉండదని, ఇదే విషయాన్ని ఇప్పటికే పలుమార్లు తమ పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారని అన్నారు. ఇక ఏపీ మాజీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విషయంలో ఎలాంటి సమస్య లేదని, ఆయనకు ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని సునీల్ దేవధర్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =