ఈసారి కూడా పరిటాలకు టికెట్ కష్టమేనా..?

Is the ticket for Parita difficult this time too,Is the ticket for Parita,Parita difficult this time too,Paritala Sriram, Dharmavaram, Varadapuram suri, Telugu desam party,Mango News,Mango News Telugu,Dharmavaram Latest News,Dharmavaram Latest Updates,Paritala Sriram Latest News,Paritala Sriram Latest Updates,Varadapuram suri Live News
Paritala Sriram, Dharmavaram, Varadapuram suri, Telugu desam party

అనంతపురం టైగర్ పరిటాల రవి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పరిటాల శ్రీరామ్. యువనేతగా రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోవాలని తహతహలాడుతున్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలని పరితపిస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లోనే శ్రీరామ్ టీడీపీ నుంచి టికెట్ ఆశించారు. కానీ అప్పుడు టీడీపీ హైకమాండ్ శ్రీరామ్‌కు కాకుండా.. ఆయన తల్లి పరిటాల సునితకు రాప్తాడు టికెట్ ఇచ్చింది. ఈక్రమంలో ఈసారి అయినా ఎన్నికల బరిలోకి దిగాలని శ్రీరామ్ భావిస్తున్నారు.

ప్రస్తుతం పరిటాల శ్రీరామ్ ధర్మవరం తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2019లో ఓటమి తర్వాత వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లడంతో.. ధర్మవరం బాధ్యతలను శ్రీరామ్ తీసుకున్నారు. ఎలాగైనా ధర్మవరం టీడీపీ టికెట్ తనకే దక్కుతుందనే ధీమాతో ఉన్నారు శ్రీరామ్. అందుకే ముందు నుంచి కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమయంలో శ్రీరామ్‌కు షాక్ ఇస్తూ.. సూరి తిరిగి టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడం అనంతపురం రాజకీయాల్లో సంచలనంగా మారింది.

2014లో ధర్మవరం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి వరదాపురం సూరి గెలుపొందారు. 2019లో కూడా టీడీపీ ఆ టికెట్ సూరికే ఇచ్చింది. కానీ ఈసారి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతిలో సూరి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకే సూరి బీజేపీలో చేరిపోయారు. అయితే ఇప్పుడు వరదాపురం సూరి తిరిగి తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబుతో సూరి సంప్రదింపులు జరిపారట. తిరిగి పార్టీలో చేరేందుకు చంద్రబాబు సూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

అటు వైసీపీ తరుపున ధర్మవరం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బరిలోకి దిగనున్నారు. అయితే కేతిరెడ్డిని ఎదుర్కోవాలంటే వరదపూరి సూరితోనే అవుతుందని చంద్రబాబు బావిస్తున్నారట. సూరికి ధర్మవరంలో బలమైన వర్గం అండ ఉండడంతో.. సూరి వైపే చంద్రబాబు మొగ్గు చూపుతున్నారట.కేతిరెడ్డిని ఓడించేందుకు సూరి, శ్రీరామ్ వర్గాలు కలిసి పని చేయాలని చంద్రబాబు కోరుతున్నారట. అయితే ఈసారి కూడా టికెట్ దక్కే అవకాశాలు లేకపోవడంతో.. పరిటాల శ్రీరామ్ వర్గమంతా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి సూరి గెలుపుకోసం పరిటాల శ్రీరామ్ వర్గం పని చేస్తుందా.. ? లేదా అన్నది చూడాలి మరి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =