టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన రావు కౌంటర్

Telangana BJP MLA Raghunandan Rao Gives Strong Counter To TRS and Congress, Telangana BJP MLA Raghunandan Rao, Raghunandan Rao, BJP MLA Raghunandan Rao Gives Strong Counter To TRS and Congress, TRS and Congress, MLA Raghunandan Rao Gives Strong Counter To TRS and Congress, BJP MLA Raghunandan Rao Gives Strong Counter To TRS, BJP MLA Raghunandan Rao Gives Strong Counter To Congress, BJP MLA Raghunandan Rao, MLA Raghunandan Rao, BJP MLA Raghunandan Rao Gives Strong Counter, Telangana BJP MLA Raghunandan Rao Shocking Comments On TRS and Congress, Telangana BJP MLA Raghunandan Rao Sensational Comments On TRS and Congress, MLA Raghunandan Rao, Telangana, Telangana Latest News, Telangana Latest Updates, Mango News, Mango News Telugu,

గడచిన కొన్ని రోజులుగా ఇటు టీఆర్ఎస్.. అటు కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీపై పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు. దీనికి కారణం.. పార్లమెంట్ వేదికగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే. నాడు సభలో అన్ని నియమాలను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ విభజన చేసిందని కాంగ్రెస్ పార్టీని మోదీ విమర్శించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ఆయన వ్యాఖ్యలు దేశమంతటా చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ నిరసన గళం విప్పాయి. మళ్ళీ తెలంగాణ ను ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపేస్తారని ప్రచారం చేయటం ప్రారంభించాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును ప్రధాని మోదీ కలిపేస్తారు. కానీ, తెలంగాణను ఏపీలో కాదు.. పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)ను భారత్‌లో కలుపుతారని రఘునందన రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో వేరే ఆలోచనే లేదని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అని గుర్తుచేశారు. అప్పుడు సభలో బిల్లు ప్రవేశపెట్టింది కాంగ్రెస్ అని.. సమర్థించింది బీజేపీ‌ అని.. కానీ చివరికి తెలంగాణను క్లెయిమ్ చేసుకుంది మాత్రం కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు న్యాయం చేస్తే బాగుండేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ పాత్రపై తెలంగాణ ప్రజలకు అవగాహన ఉందన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 5 =