ఇలాంటి ఫ్యాన్స్ పవన్‌కే ఉంటారని ప్రశంసలు

Janasena QR code in wedding Card, Pawan fans ,YCP , Pawan Kalyan,Janasena,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,jenasena updates,andhra pradesh,AP Political updates,Mango News Telugu,Mango News
Janasena QR code in wedding Card, Pawan fans ,YCP , Pawan Kalyan,Janasena

మారుతున్న కాలానికి తోడు అలవాటు,  కల్చర్ కూడా మారుతుంది. అలాగే ఇప్పుడు పెళ్లి వేడుకల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి.  ఒకప్పుడు పెళ్లయితే చదివింపుల కార్యక్రమంలో  ఓ పుస్తకం పట్టుకుని ఒక మనిషి కూర్చుంటే అంతా అక్కడకు వెళ్లి వధూవరులకు తమ కట్న, కానుకలను చదివించేవారు.  కానీ ఇప్పుడు చాలా  వివాహ వేడుకల్లో నగదు చదివించడం కోసం..పెళ్లి కార్డులో కానీ..పెళ్లి మండపం దగ్గర కానీ గూగుల్ పే, ఫోన్ పే వంటి క్యూ ఆర్ కోడ్‌లతో బోర్డులు పెడుతున్నారు.

వధూవరులను ఆశీర్వదించిన  కుటుంబీకులు, స్నేహితులు అక్కడ క్యూ ఆర్ కోడ్ ద్వారా మనీ యాడ్ చేస్తే అది  డైరెక్ట్ గా వారి అకౌంట్‌లో జమ అవుతుంది. తాజాగా  ఇలాంటి పని చేసిన పవన్ అభిమాని.. అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు. అందరి అభిమానుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు వేరయా అని చాటి చెప్పేలా  ఇంకో అడుగు వేశాడు. తన పెళ్లి పత్రికలో.. జనసేన పార్టీ క్యూ ఆర్ కోడ్ పెట్టించి.. పార్టీపైన, పవన్ పైన తన  అభిమానాన్ని చాటుకున్నాడు. తన పెళ్లి కోసం కానుకగా ఇచ్చే నగదును పార్టీకి చేరేలా చేసి తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు రామారావు అనే యువకుడు.

‘నాసేన కోసం నా వంతు.. మన భవిత కోసం శ్రమించే మన జనసేనను ఆర్థికంగా బలోపేతం చేద్దాం’ అని క్యూర్ కోడ్ పై రాయడంతో చాలామంది రామారావు చేసిన పనిని మెచ్చుకుంటున్నారు . మన ఇంటి పెద్ద ఎంత బాధ్యతగా ఉండాలో.. మన రాష్ట్ర పెద్ద అంతే బాధ్యతగా ఉండాలి. ఓటు హక్కును వినియోగించుకో.. సరైన నాయకుడిని ఎన్నుకో అని వెడ్డింగ్ కార్డుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ ఫోటోతో పాటు జనసేన పార్టీ సింబల్‌ను ముద్రించారు.

హిట్టులో తోడున్నాం.. ఫ్లాపుల్లో తోడున్నాం, ఓటమిలో తోడున్నాం, గెలిచే వరకు తోడుందాం అని పెళ్లి పత్రికలో రామారావు రాయించారు.హైదరాబాద్ కేపీహెచ్‌బీలో జరిగిన ఈ పెళ్లి కోసం ప్రింట్ చేయించిన ..ఈ వెడ్డింగ్ కార్డ్  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇలాంటి అభిమానులు పవన్ కళ్యాణ్‌కే సొంతం అని కొంతమంది హర్షం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం చందాల కోసం పెళ్లిని కూడా వదల్లేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు. కానీ తనకు వచ్చిన కానుకలను పెళ్లి కొడుకు ఇస్తున్నాడు..ఇందులో మీకొచ్చిన కష్టం ఏంటి అంటూ జనసైనికులు కౌంటర్ అటాక్‌కు దిగుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 12 =