ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఏప్రిల్‌ 22న సున్నా వడ్డీ పథకం నగదు విడుదల

Minister Perni Nani Press Meet Over AP Cabinet Meeting Decisions, Minister Perni Nani Press Meet, AP Cabinet Meeting Decisions, Perni Nani Press Meet, Minister Perni Nani, AP Cabinet Meeting, Last Cabinet Meeting, Andhra Pradesh Ministers Last Cabinet Meeting, Ministers To Resign Today, Andhra Pradesh Ministers To Resign Today, Andhra Pradesh Ministers, Andhra Pradesh ministers to resign ahead of Cabinet reorganisation on April 11, CM YS Jagan Cabinet to Resign Tomorrow, CM YS Jagan Cabinet To Make Way for New Team with Caste, Andhra Pradesh All set for AP Cabinet reshuffle on April 11, AP Cabinet reshuffle on April 11, AP Cabinet reshuffle, AP Cabinet reshuffle, YS Jagan Mohan Reddy Cabinet reshuffle, Cabinet reshuffle, AP Cabinet reshuffle Latest News, AP Cabinet reshuffle Latest Updates, AP Cabinet reshuffle Live Updates, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, AP CM, YS Jagan, CM Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ఏప్రిల్ 7, గురువారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో ప్రస్తుత రాష్ట్ర కేబినెట్ చివరి సమావేశం జరిగింది. ఈ కేబినెట్‌ భేటీలో మొత్తం 36 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే కేబినెట్ పునర్‌ వ్యవస్థీకరణ నేపథ్యంలో తాజా భేటీ తర్వాత ప్రస్తుత కేబినెట్ మంత్రులంతా రాజీనామాలు చేశారు. మొత్తం 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం వైఎస్ జగన్ కు అందజేశారు. రాజీనామా లేఖలను ఆమోదం కోసం గవర్నర్ కార్యాలయానికి పంపించగా, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రుల రాజీనామాలను నేడో రేపో ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఏప్రిల్ 11న రాష్ట్రంలో కొత్త కేబినెట్ కొలువుతీరనుంది. ఇక కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు:

  • మూడో ఏడాది కూడా సున్నా వడ్డీ పథకం అమలు, ఏప్రిల్‌ 22న రూ.1,259 కోట్ల సున్నా వడ్డీ పథకం నగదు విడుదల చేయనున్న సీఎం వైఎస్ జగన్
  • 8 మండలాలతో పులివెందుల, 7 మండలాలతో కొత్తపేట రెవెన్యూ డివిజన్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
  • కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో 12 పోలీస్‌ సబ్‌ డివిజన్స్, 16 పోలీస్‌ సర్కిళ్ల ఏర్పాటుకు ఆమోదం
  • జిల్లా పరిషత్ కాలపరిమితి, రిజర్వేషన్స్ కొనసాగింపు
  • చిత్తూరు జిల్లాలోని పుంగనూరు వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీలో కొత్తగా 12 ఉద్యోగాల భర్తీకి ఆమోదం
  • ఏపీ మిల్లెట్‌ మిషన్‌ పాలసీకి ఆమోదం
  • పలు ప్రాంతాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటుకు ఆమోదం.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =