యాత్రికులకు సికింద్రాబాద్‌ రైల్వే గుడ్ న్యూస్‌..!

South Central Railway Begins First Bharat Gaurav Train From Telugu States For Pilgrims,South Central Railway Begins First Bharat Gaurav Train,First Bharat Gaurav Train From Telugu States,First Bharat Gaurav Train For Pilgrims,Mango News,Mango News Telugu,First Bharat Gaurav tourist train,South Central Railway,Secunderabad Railway good news for pilgrims,Bharat Gaurav Tourist Train, Bharat Gaurav, Tourist Train, KASHI-GAYA PAVITHRA PIND DAAN YATRA,South Central Railway Latest News,South Central Railway Latest Updates,First Bharat Gaurav Train News Today

సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికులకు ఒక శుభవార్త. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్‌సీటీసీ మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రకటించింది. కాశీ, గయ పవిత్ర పిండదాన్ యాత్ర పేరుతో సెప్టెంబరు 26, అక్టోబరు 8 తేదీల్లో ఈ రైలు అందుబాటులో ఉండనుంది. 7 రాత్రులు, 8 రోజుల టూర్ ప్యాకేజి. మొత్తం 710 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి. గయ, వారణాసి, ప్రయాగ్ రాజ్ కవరవుతాయి. సికింద్రాబాద్ నుంచే కాకుండా ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్ల నుంచి కూడా ఈ రైలును అందుకోవచ్చు.

ఈ భారత్ గౌరవ్ టూరిస్టు రైలులో స్లీపర్ బెర్తులు 460, థర్డ్ ఏసీ బెర్తులు 200, సెకండ్ ఏసీ బెర్తులు 50 ఉంటాయి. సికింద్రాబాద్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు , రాజమండ్రి , సామర్లకోట, పెందుర్తి, విజయనగరం, పలాస రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. టికెట్లు బుక్ చేసుకున్న యాత్రికులు సికింద్రాబాద్ నుంచే కాకుండా ఈ స్టేషన్లలో కూడా రైలు ఎక్కొచ్చు.

మొదటి రోజు సికింద్రాబాద్‌లో ప్రారంభమవుతుంది. రెండో రోజు కూడా ప్రయాణం ఉంటుంది. మూడో రోజు గయ చేరుకుంటారు. పిండప్రదాన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బోధ్ గయ చూడొచ్చు. రాత్రికి గయలో బస ఉంటుంది. నాలుగోరోజు కూడా పిండ ప్రదాన కార్యక్రమాలుంటాయి. అనంతరం విష్ణుపాద ఆలయ దర్శనం ఉంటుంది. అక్కడి నుంచి కాశీ బయలుదేరతారు. ఐదో రోజు వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, గంగా హారతి చూస్తారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్ వెళతారు. ఆరో రోజు త్రివేణి సంగమం సందర్శన ఉంటుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఏడోరోజు, ఎనిమిదోరోజు ఆయా స్టేషన్లలో ఆగుతూ సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ప్యాకేజీ మూడు కేటగిరీల్లో అందుబాటులో ఉంటుంది. ఎకానమి డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.13,900, స్టాండర్డ్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.22,300, కంఫర్ట్ డబుల్, ట్రిపుల్ షేర్ ధర రూ.29,300. రైల్ టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు టికెట్ ధరలో 33 శాతం తగ్గింపు ప్రకటించారు. ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్ ఏసీ గదుల్లో బస, స్టాండర్డ్ కేటగిరీలో థర్డ్ ఏసీ ప్రయాణం, కంఫర్ట్ కేటగిరీలో సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనాల్లో సైట్ సీయింగ్, టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. https://www.irctctourism.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో Bharat Gaurav పైన క్లిక్ చేయాలి. KASHI-GAYA PAVITHRA PIND DAAN YATRA లింక్ పైన క్లిక్ చేసి, వివరాలన్నీ చెక్ చేసి, లాగిన్ అయి బుక్ చేయాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 13 =