అన్ని నియోజకవర్గాలలోనూ కూటమి పోటీ

Pawan Kalyan,Janasena,Bhimavaram, Alliance, all constituencies, TDP, YCP,Chandra Babu,YS Jagan, Grandhi Srinivas,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections, Mango News Telugu, Mango News
Pawan Kalyan,Janasena,Bhimavaram, Alliance, all constituencies, TDP, YCP,Chandra Babu,YS Jagan, Grandhi Srinivas,

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో సీట్లపై ఫైనల్‌గా తీసుకున్న నిర్ణయంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే,గతంలో అనుకున్న 24 సీట్లను కాదని 21 సీట్లతో జనసేన కోత విధించుకోవడం హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై తాజాగా వివరణ ఇచ్చిన పవన్ వివరణకు విశ్లేషకులు కూడా పవన్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

సీట్ల కోతపై మంగళవారం మాట్లాడిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తాను తీసుకున్న సీట్లు తక్కువా, ఎక్కువా అనేది పక్కన పెట్టమన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీలు 175 స్థానాల్లోనూ పోటీ చేస్తున్నట్లు అంతా భావించాలని పవన్ వివరించారు. తమ టార్టెట్ అంతా వైఎస్‌ జగన్ అధికారంలో ఉండకూడదనే అని చెప్పుకొచ్చారు. ఒక్కరి దగ్గర అంత సంపద ఉండకూడదన్నారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికే కాదు దేశానికే ముప్పని హెచ్చరించారు జనసేనాని. ఏపీలో జగన్ పోవాలి.. భీమవరంలో గ్రంధి శ్రీనివాస్ పోవాలంటూ నినాదాలు చేశారు..

భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసును అక్కడి నుంచి తరిమేయాలని పవన్ పదేపదే పిలుపునిచ్చారు పవన్‌. భీమవరంలో చాలా మందికి గ్రంధి బంధువేనన్న పవన్..తప్పులు చేసినా అతనిని మన కులస్తుడని వదిలేయాలా అని ప్రశ్నించారు. వీధిరౌడీని ఎమ్మెల్యే చేయడం వల్ల..ఇప్పుడు భీమవరంలో సోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే పరిస్థితి ఉందని అన్నారు.

సొంత కారు డ్రైవరునే చంపిసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు మన కులస్తుడేనని వదిలేస్తామా..? అని పవన్ ప్రశ్నించారు. జైలుకెళ్లిన అనంతబాబు బెయిల్ మీద బయటకు వస్తే.. బాస్ ఈజ్ బ్యాక్ అనడం ఎంత వరకూ కరెక్టే అని నిలదీశారు.

జనసేన పార్టీని పెట్టడానికి సొంత అన్నను కూడా కాదని వచ్చానని… సొంత అన్నయ్యనే ఇబ్బంది పెట్టి వచ్చానని పవన్ గుర్తు చేసుకున్నారు.తాను గెలిచి ఉంటే భీమవరంలో డంపింగ్ యార్డును తొలగించేవాడిననని చెప్పుకొచ్చారు. నిజానికి తాను పద్దతిగా మాట్లాడతానని.. దిగి దిగి మాట్లాడతా అని కానీ, ఎదుటి వాళ్లు యుద్ధం కోరుకుంటే మాత్రం తాను దానికి రెడీ అని క్లారిటీ ఇచ్చారు.

సిద్ధం.. సిద్ధం అంటూ సీఎం జగన్ కోకిలలా కూస్తున్నారన్న పవన్ కళ్యాణ్.. ఆ జగన్‌తో తాను యుద్దానికి సిద్ధం అని ప్రకటించారు. యుద్ధం అంతిమ ఫలితం ప్రక్షాళనే ఉంటుందని గుర్తు చేశారు. జగన్ జలగలను తీసేస్తామన్న పవన్..భీమవరంలో ఉన్న జగన్ జలగ గ్రంధిని తీసేస్తామని చెప్పుకొచ్చారు.

కాపు కులస్తుడని గ్రంధి శ్రీనివాస్‌ని వెనకేసుకు వస్తే..ఆ ప్రభావం మొత్తం కులం మీదే పడుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. గొడవలు పెంచే వారు తనకొద్దని..గొడవలు తగ్గించేవారు కావాలని అన్నారు. అందుకే రామాంజనేయులను జనసేన పార్టీలోకి ఆహ్వానించానని చెప్పుకొచ్చారు. రానున్న ఎన్నికల్లో జనసేన భీమవరాన్ని కొట్టి తీరాలని పిలుపునిచ్చారు. భీమవరంలో జనసేన గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు పవన్‌ కల్యాణ్‌.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =