బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు రేపే ప్రారంభం, సభ్యులు వీళ్లేనా?

Bigg Boss Telugu Season 5 Starts from Tomorrow

తెలుగు టీవీ ప్రేక్షకులను గత 4 సీజన్లలో ఎంతగానో అలరించిన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ఐదో సీజన్ రేపు(సెప్టెంబర్ 5, ఆదివారం) సాయంత్రం 6 గంటలకు ప్రారంభం అవుతుంది. బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగు సోమ‌వారం నుండి శుక్రవారం వ‌ర‌కు రాత్రి 10 గంటలకు, శ‌ని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ సీజన్ కి కూడా అగ్ర కథానాయకుడు, కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవరించనున్నారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగులో పాల్గొనే సభ్యులపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు.

కాగా బిగ్‌బాస్ లో పాల్గొనేది వీళ్ళేనంటూ పలువురు పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. యాంకర్ రవి, యూట్యూబ్ ఫేమ్ షన్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, శ్వేతా వర్మ, లహరి షారి, లోబో, సిరి హనుమంత్, నటి ప్రియా, నటి ఉమాదేవి, సరయు, మానస్, మోడల్ జస్వంత్, సన్నీ, నటరాజ్ మాస్టర్, దీపక్ సరోజ్, సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ ప్రియాంక సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీళ్లు గాని, నిర్వాహకులుగాని షో పాల్గొంటునట్టు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే సభ్యులకు ముందుగానే పరీక్షలు నిర్వహించి, క్వారంటైన్‌ లో ఉంచారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారినే బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. బిగ్‌బాస్ మొదటి సీజన్లో శివబాలాజీ, రెండో సీజన్లో కౌశల్, మూడో సీజన్లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్లో అభిజిత్ విజేతలుగా నిలిచారు. నాలుగు సీజన్స్ లో బిగ్‌బాస్ లో పాల్గొన్న సభ్యులు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఐదో సీజన్ తో కూడా సరికొత్తగా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ, ఆకట్టుకోనున్నట్టు చెబుతున్నారు. రేపు మొదలయ్యే బిగ్‌బాస్ 5 తెలుగు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − seven =