ఒక్క ఏడాది హల్వా వేడుక రద్దు

A Halwa Ceremony Is Customary Before The Budget,Customary Before The Budget,A Halwa Ceremony,Halwa Ceremony ,Cbdt, Cbic, Pib, Halwa Ceremony,Before The Budget,Halwa Celebration Canceled For One Year,Mango News,Mango News Telugu,Union Budget 2023-24,Finance Minister Niramala Sitharaman,Customary Halwa Ceremony,Union Budget,Halwa Ceremony Latest News,Halwa Ceremony Latest Updates
Halwa Ceremony ,CBDT, CBIC, PIB, halwa ceremony,before the Budget,Halwa celebration canceled for one year

మోడీ సర్కార్ ఈ ఏడాది మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఫిబ్రవరి 1, 2024న  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న తొలి మధ్యంతర బడ్జెట్.అయితే ప్రతీ బడ్జెట్‌కు ముందు హల్వా వేడుకను ఆనవాయితీగా జరుపుకోవడం చూస్తుంటాం. ఈ హల్వా వేడుక లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని ఎవరూ చూడలేదు. కానీ ఒక్క ఏడాది మాత్రం ఈ వేడుకను రద్దు చేసిందన్న విషయం చాలామందికి తెలియదు.

నిజానికి ఈ హల్వా వేడుకను బడ్జెట్‌తో ముడిపడి ఉన్న సంప్రదాయంగా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయం బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు జరుగుతుంది.  ఆర్థిక మంత్రిత్వ శాఖలోని బడ్జెట్‌ తయారుచేసిన అధికారుల మధ్య..ఒక పెద్ద పాన్‌లో తయారు చేసిన హల్వాను ఉంచుతారు.  ఆర్థిక మంత్రి స్వయంగా పాన్ నుంచి హల్వా తీసి పంచడంతో  లాంఛనప్రాయంగా హల్వా వేడుకను జరుపుకుంటారు.

బడ్జెట్‌ సిద్దమైన తర్వాత బడ్జెట్‌ ప్రతులను ప్రింటింగ్‌‌కు పంపించే ముందు ఈ హల్వా వేడుక జరుపుకొని అధికారికంగా ప్రారంభిస్తారు.బడ్జెట్ ప్రింట్ చేయడానికి  ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ లోనే  ప్రెస్ కూడా ఉంటుంది. ఈ రోజు నుంచే బడ్జెట్ ప్రతుల కోసం ఆర్థిక శాఖలో పటిష్టమైన భద్రత ఉంటుంది. బడ్జెట్‌లో ఏ విషయాలున్నాయో బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. బడ్జెట్‌కు సంబంధించి ఎలాంటి చిన్న సమాచారం కూడా లీకేజీ కాకుండా చూస్తారు.

దీనిని నిరోధించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖ, సీబీడీటీ, సీబీఐసీ, పీఐబీలో కొంతమంది అధికారులు నార్త్ బ్లాక్‌లో సుమారు 10 రోజుల పాటు నిర్బంధంలోనే ఉండిపోతారు. ఈ సమయంలో వీరెవరూ ఎలాంటి అవసరం వచ్చినా  వాళ్ల ఇంటికి కూడా వెళ్లరు. కుటుంబ సభ్యులు, బంధువులతో ఈ 10 రోజులు వారికి ఎలాంటి సంబంధం ఉండదు.

అధికారులలో ఎవరైనా తమ కుటుంబ సభ్యులతోనో లేదా ఎవరితోనైనా అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడవలసి వస్తే మాత్రం.. ఫోన్‌లోనే మాట్లాడుతారు. అది కూడా  ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘాలో  ఈ ఫోన్ కాల్స్ ఉంటాయి. అధికారులంతా ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను సమర్పించాక మాత్రమే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్  అయిన నార్త్ బ్లాక్ నుంచి బయటకు వస్తారు.

ఇప్పటి వరకూ ప్రతీ బడ్జెట్‌లోనూ కనిపించే హల్వా వేడుక ఒకసారి మాత్రం రద్దు చేయాల్సి వచ్చింది. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు బడ్జెట్‌తో పాటు నిర్వహించాల్సిన హల్వా వేడుకను రద్దు చేశారు. ఇది 2022 బడ్జెట్‌కు ముందు .. దేశంలో  కరోనా కేసుల విపరీతంగా పెరిగపోతుండంతో .. ఆ ఏడాది ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను నిర్వహించకుండా అధికారులకు స్వీట్లు పంచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 7 =