కరోనాపై పోరాటంలో భాగంగా 2 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేట‌ర్స్‌ అందిస్తాం: బీసీసీఐ

bcci, BCCI Decides to Contribute 2000 Oxygen Concentrators, BCCI Decides to Contribute 2000 Oxygen Concentrators Towards India’s Fight Against Covid-19, BCCI donation, BCCI to Contribute 10-Litre 2000 Oxygen Concentrators, BCCI to contribute 2000 10-liter Oxygen concentrators, BCCI to donate 2000 Oxygen concentrators, India’s Fight Against Covid-19, Mango News

కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశం చేస్తున్న ప్రయత్నాలకు మద్ధతుగా 2 వేల ఆక్సిజన్‌ కాన్సంట్రేట‌ర్స్‌ ను(10 లీటర్ల సామర్థ్యం) అందించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం నాడు ప్రకటించింది. “దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వైద్య పరికరాలు మరియు ప్రాణాలను రక్షించే ఆక్సిజన్ కోసం డిమాండ్ పెరిగింది. రాబోయే కొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కాన్సంట్రేట‌ర్స్‌ పంపిణీ చేస్తాం. ఈ చొరవ ద్వారా అవసరమైన బాధితులకు వైద్య సహాయం మరియు సంరక్షణ అందించబడుతుందని భావిస్తున్నాం” అని బీసీసీఐ పేర్కొంది.

ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, “కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్నఈ సుదీర్ఘ యుద్ధంలో వైద్య, ఆరోగ్య విభాగం పోషిస్తున్న కీలక పాత్రను బీసీసీఐ గుర్తించింది. వైద్య సిబ్బంది నిజంగా ఫ్రంట్‌లైన్ యోధులుగా ఉన్నారు మరియు ప్రజలను రక్షించడానికి ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బోర్డు ఎల్లప్పుడూ ఆరోగ్యం మరియు భద్రతకు అగ్రస్థానం ఇస్తుంది. ఆక్సిజన్ అవసరమైన కరోనా బాధితులకు ఆక్సిజన్‌ కాన్సంట్రేట‌ర్స్‌ తక్షణ ఉపశమనం ఇస్తాయి, వారు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి” అని పేర్కొన్నారు. బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ, ఈ సంక్షోభ సమయంలో వైద్య పరికరాల యొక్క అవసరాన్ని బీసీసీఐ అర్థం చేసుకుందన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పడిన ఆక్సిజన్ డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించడంలో బీసీసీఐ చేసే ఈ ప్రయత్నం సహాయపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nineteen =