వెనిగండ్ల రాముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయా?

last election for Kodali?,Kodali Nani,Venigandla Ramu,YCP, TDP, Jana Sena, AP Assembly Elections, Gudivada
last election for Kodali?,Kodali Nani,Venigandla Ramu,YCP, TDP, Jana Sena, AP Assembly Elections, Gudivada

గుడివాడ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఈ ఎన్నికలను ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న నేతగా కొడాలి నానికి పేరుండటంతో  పాటు.. నందివాడ, గుడివాడ రూరల్‌తో పాటు గుడ్లవల్లేరు ప్రాంతాల్లో ఆయనకు మంచి పట్టుంది.

కొడాలి నాని ఇప్పటి వరకు నాలుగుసార్లు వరుసగా గుడివాడ నుంచే గెలిచారు. 2004లో మొదలైన కొడాలి నాని గెలుపు ప్రస్థానం 2019 వరకు కొనసాగుతూనే  ఉంది.  ఇప్పుడు 2024లో తన లక్ ను పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నారు. కొడాలి నాని టీడీపీ అభ్యర్థిగా 2004, 2009లో పోటీ చేసి గెలిచారు. తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి 2012లో వైసీపీలో చేరి..2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సాధించారు. 2019లో జగన్‌ ప్రభుత్వంలో మంత్రి పదవిని చేపట్టారు.  ఈ సారి కూడా వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము పోటీ చేస్తున్నారు.రాము కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. బీటెక్‌ చదివిన రాము. ఎన్‌ఆర్‌ఐ.  అమెరికాలో ఎఫిసెన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థను స్థాపించిన ఆయన.. కొన్నేళ్లుగా గుడివాడలోనే మకాం వేశారు. వెనిగండ్ల పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి దాని ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ గుడివాడ ప్రాంతవాసులకు చేరువయ్యారు.

గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం, తాగు నీటిని అందించడం, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు, అన్నదానం , పేద విద్యార్థుల చదువులకు సహాయపడటం చేస్తూ ఆ ప్రాంతవాసులకు దగ్గరయ్యారు. గతేడాది  వర్షాలతో నష్ట పోయిన రైతులకు సొంత నిధులతో సాయాన్ని అందించారు.కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాము.. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మహిళను కులాంతర వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి అక్కడ పాస్టర్‌గా పని చేస్తున్నారు.

గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎస్సీ ఓటర్లు సుమారు 53వేలు, కాపు సామాజిక వర్గ ఓటర్లు 26వేలు, యాదవ సామాజిక వర్గ ఓటర్లు 15వేలు, గౌడ్‌ సామాజిక వర్గ ఓటర్లు 14వేలు, కమ్మ సామాజిక వర్గ ఓటర్లు 10వేల వరకు ఉన్నాయి. కులాంతర వివాహం కూడా రాముకు కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

దీంతో పాటు గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంలోని టీడీపీ శ్రేణులందరిని ఒకే తాటిపైకి తీసుకొని రావడంలో  రాము సక్సెస్‌ అయ్యారు. ఇటీవల  ఇవే నా చివరి ఎన్నికలు అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశం అయ్యాయి. ఒక వైపు నియోజక వర్గంలో నానిపై పెరుగుతున్న వ్యతిరేకత..ఇంకో వైపు వెనిగండ్ల రాముకు పెరుగుతున్న సానుకూలత వల్లే.. ఇవే నా చివరి ఎన్నికలంటూ  నాని వ్యాఖ్యలు చేశారన్న టాక్ నడుస్తోంది. మొత్తంగా గుడివాడ రాజకీయాలపై ఏపీ వ్యాప్తంగా హాటుహాటు చర్చలు  నడుస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 15 =