దేశంలో ఒక్కరోజే 2,15,195 కరోనా పరీక్షలు, కోలుకున్నవారి శాతం 56.71%

Coronavirus Cases In India, Coronavirus Deaths In India, Coronavirus In India, Coronavirus in India live updates, Coronavirus outbreak, Coronavirus Tests, Coronavirus Tests in India, Covid-19 Tests in India, Covid-19 Tests In Private Hospitals, India Covid-19 Tests, Rapid COVID-19 tests, Total Corona Cases In India

దేశంలో కోవిడ్-19 నిర్థారణ పరీక్షలు గణనీయంగా పెరిగాయి. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 2,15,195 శాంపిల్స్ పరీక్షించగా, ఇప్పటివరకు జరిపిన మొత్తం పరీక్షల సంఖ్య 73,52,911 కు చేరింది. నిన్న ప్రభుత్వ ల్యాబ్ లలో 1,71,587 పరీక్షలు చేయగా, ప్రైవేట్ ల్యాబ్ లలో 43,608 పరీక్షలు చేసినట్టు ప్రకటించారు. ప్రైవేట్ ల్యాబ్ లలో కూడా పరీక్షలు గణనీయంగా నిర్వహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా నిర్థారణ పరీక్షా కేంద్రాల (తక్షణం ఫలితాలు చూపే పరీక్షల లాబ్స్, ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్, సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్) సంఖ్య 1000 కి చేరింది. ప్రభుత్వ లేబరేటరీల సంఖ్య ఇప్పుడు 730 కి చేరుకోగా, ప్రైవేట్ లాబ్స్ సంఖ్య 270 కి పెరిగింది. అలాగే కోవిడ్-19 నుంచి కోలుకుంటున్నవారి శాతం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. కరోనా సోకి కోలుకున్నవారి శాతం 56.71% కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 2,58,684 మంది పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే మొత్తం 10,495 మంది కోవిడ్-19 బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,83,022 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + ten =