దేశంలో జైకోవ్‌-డి కోవిడ్-19 వ్యాక్సిన్ కు అనుమతి, 12 ఏళ్లు దాటిన వారికీ అందుబాటులోకి వచ్చిన తొలి వ్యాక్సిన్

DCGI Gives Emergency Use Authorization for ZyCoV-D Covid-19 Vaccine, DCGI Gives Emergency Use Authorization for ZyCoV-D Covid-19 Vaccine Developed by Zydus Cadila, Emergency Use Authorization for ZyCoV-D Covid-19 Vaccine, mango newss, ZyCoV-D, ZyCoV-D Covid-19 Vaccine Developed by Zydus Cadila, Zydus Cadila, Zydus Cadila vaccine gets emergency nod, Zydus Cadila’s 3-Dose Covid Vaccine ZyCoV-D, Zydus Cadila’s Covid-19 vaccine ZyCoV-D gets approval, Zydus Cadila’s three-dose vaccine gets DCGI nod, Zydus Cadila’s ZyCoV-D vaccine gets DCGI nod

దేశంలో త్వరలో మరో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. జైడస్‌ క్యాడిలా సంస్థ పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసిన “జైకోవ్‌-డి” అనే కోవిడ్-19 వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆగస్టు 20, శుక్రవారం నాడు ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత కోవిడ్-19 వ్యాక్సిన్ గా జైకోవ్‌-డి గుర్తింపు పొందింది. అలాగే భారత్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన రెండో వ్యాక్సిన్ గా నిలిచింది. ఈ వ్యాక్సిన్ ను 12 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు మరియు పెద్దలకు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మిషన్ కోవిడ్ సురక్ష కింద కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ భాగస్వామ్యంతో ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి చేయబడింది. ఫేజ-3 క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాల ఆధారంగా, 28,000 మంది వాలంటీర్లలో రోగలక్షణ ఆర్టీ-పీసీఆర్ పాజిటివ్ కేసుల్లో ఈ వ్యాక్సిన్ 66.6 శాతం ప్రాథమిక సామర్థ్యాన్ని చూపించిందని తెలిపారు. భారతదేశంలో ఇప్పటివరకు కోవిడ్-19 కోసం జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ ట్రయల్ ఇదేనని, ఫేజ్1/2 మరియు ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ రెండూ స్వతంత్ర డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ ద్వారా పర్యవేక్షించబడ్డాయని చెప్పారు.

ముందుగా అత్యవసర వినియోగానికి జైడస్‌ క్యాడిలా దరఖాస్తు అనంతరం, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ పరిశీలించి, ఆమోదానికి సిఫార్సు చేసింది. దీంతో డీసీజీఐ తాజాగా జైకోవ్‌-డి వ్యాక్సిన్ కు అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించింది. జైకోవ్‌-డి అనేది నీడిల్‌లెస్ ఇంజక్షన్. ఫార్మాజెట్‌ అనే సాధనం ద్వారా దీన్ని చర్మంలోకి ఎక్కిస్తారు. 12ఏళ్లు పైబడినవారందరికీ అందించే ఈ వ్యాక్సిన్ ను (0-28-56 రోజుల్లో) మూడు డోసులలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కోవిషీల్డ్, కొవాక్జిన్, స్పుత్నిక్-వీ, మోడర్నా, జాన్సన్‌ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్, తాజాగా జైకోవ్‌-డితో కలిపి మొత్తం 6 వ్యాక్సిన్లకు దేశంలో అనుమతులు జారీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =