ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం, మద్యం హోమ్ డెలివరీకి అనుమతి

Delhi Alcohol Delivery, Delhi Government, Delhi government allows home delivery of liquor, Delhi Government Decided to Allow Home Delivery of Liquor, Delhi government permits home delivery of liquor, Delhi Government to Allow Home Delivery of Liquor, Delhi govt permits home delivery of liquor through mobile app, Delhiites can now get Indian foreign liquor at home, Home delivery of liquor in Delhi, Liquor, Liquor Home Delivery, Mango News

దేశ రాజధాని ఢిల్లీలో జూన్ 7 వరకు వరకు లాక్‌డౌన్‌ పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అన్‌లాక్‌ ప్రక్రియను క్రమంగా ప్రారంభిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై మద్యం హోమ్ డెలివ‌రీ చేసుకునేందుకు అనుమ‌తి ఇస్తూ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మొబైల్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల ద్వారా దేశీ, విదేశీ మద్యం పంపిణీ చేయడానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు.

అయితే కేవలం ఎల్-13 లైసెన్స్ కలిగి ఉన్న దుకాణాలకు మాత్రమే హోమ్ డెలివరీ చేపట్టడానికి అనుమతి ఉంటుందని, నగరంలోని ప్రతి మద్యం దుకాణానికి ఉండదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ అందుకున్నప్పుడే లైసెన్సు కలిగిన దుకాణాలు మద్యాన్ని హోమ్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. కాగా హాస్టల్స్ కు, కార్యాలయాలకు మరియు సంస్థలకు డెలివరీ చేయకూడదని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =