డైట్‌ కోక్‌తో క్యాన్సర్ ముప్పు?

Diet Coke Aspartame Conditions that lead to cancer Artificial sweetener,Diet Coke,Aspartame,Conditions that lead to cancer,Artificial sweetener,Diet Coke lead to cancer,Diet Coke Artificial sweetener,Mango News,Mango News Telugu,Aspartame used in products,Artificial Sweeteners and Cancer,Sweetener In Your Diet Coke,Aspartame sweetener commonly used,Aspartame and Cancer Risk,Key ingredient in Diet Coke,Common artificial sweetener,WHO to Announce Artificial Sweetener,Health effects of aspartame,Diet coke cancer warning,Dangers of artificial sweeteners Aspartame cancer study Latest News,Aspartame cancer study Latest Updates,Artificial sweeteners Latest News,Artificial sweeteners Latest Updates

చాలా మంది నీళ్ల బాటిల్ అయినా వెంట తీసుకెళ్లరు కానీ.. కోక్ వంటి కూల్ డ్రింక్‌(Cool Drinks)లు లేకుండా బయటకు వెళ్లరు. అందులోనూ వేసవిలో నీళ్లకు బదులు కోక్(Diet Coke) తాగేవాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అయితే అలాంటి డైట్ కోక్‌లో వాడే అస్పర్టమే అనే పదార్ధం .. క్యాన్సర్‌కు కారణమవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అవును ప్రపంచంలో చాలా మంది చాలా ఎక్కువగా వాడే ఆర్టిపిషియల్ స్వీట్నెర్ (Artificial sweetener) ఇది. కోక్‌లో ఎక్కువగా ఉండటం వల్ల ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని W.H.O చెబుతోంది.

అమెరికాలో ఎక్కువగా షుగర్‌కు బదులు ఆర్టిపిషియల్ స్వీట్నెర్(Artificial sweetener) అస్పర్టమే (Aspartame)ను వాడతారు. దీనిని ఎప్పటి నుంచో కోక్‌లో వాడుతున్న విషయం చాలామందికి తెలియదు. ఇది శరీరంలో చేరాక క్యాన్సర్‌‌కు దారి తీసే పరిస్థితుల (Conditions that lead to cancer)కు కారణమవుతుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌తో పాటే ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O) హెచ్చరిస్తున్నాయి. ఈ విషయాన్ని అతి త్వరలోనే ప్రపంచమంతటా ప్రకటించే అవకాశం కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

నిజానికి అస్పర్టమేలో క్యాలరీలు ఏమీ ఉండవు. కానీ సాధారణ షుగర్ (Simple sugar) కంటే దాదాపు 200 రెట్లు తీపిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెర్ వాడకం వల్ల ముప్పుందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ స్వీట్నెర్‌ను మొదటిసారి మనుష్యులకు క్యాన్సర్ కలిగించే కారకంగా గుర్తించారు. గతేడాది ఫ్రాన్స్‌లో లక్ష మందిని అధ్యయనం చేయగా.. ఆ అధ్యయనంలో ఎక్కువ మొత్తంలో కృత్రిమ స్వీట్నెర్లు వినియోగించే వ్యక్తులు క్యాన్సర్ ముప్పు కలిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

అస్పర్టమే ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుందంటే.. శరీరంలో నియంత్రణ లేకుండా ఒకే చోట కణాలు పెరిగి పుండుగా మారతాయి. తర్వాత అదే క్యాన్సర్‌గా మారుతుంది. ఈ పుండు ఒక చోట నుంచి మరో చోటకు త్వరగా సోకుతుంది. దీనిని ప్రారంభంలో గుర్తిస్తే ముప్పు తక్కువగా ఉంటుంది. కానీ ప్రపంచంలో అతి ప్రమాదకరమైన వ్యాధి అయిన క్యాన్సర్ వచ్చాక పూర్తి జీవితకాలం జీవించడం కష్టం. కాబట్టి ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నెర్‌ వాడకాలకు దూరంగా ఉండాలి.

అస్పర్టమేను.. డైట్ కోక్‌(Diet Coke)తో పాటు, డైట్ సోడా, షుగర్ ఫ్రీ సోడా,ఐస్ క్రీమ్, చూయింగ్ గమ్, కాఫీ స్వీట్నెర్లు, పుడ్డింగ్, షుగర్ ఫ్రీ డిజర్ట్స, షుగర్ ఫ్రీ జామ్‌ల వంటి వాటిలో ఈ అస్పర్టమే స్వీట్నర్న్‌నే ఉపయోగిస్తారు. ఎన్విరాన్మెంటల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించిన ఓ ఆర్టికల్ ప్రకారం 5000 కంటే ఎక్కువ ఉత్పత్తుల్లో అస్పర్టమేను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దాంతో ముప్పు ఉండటంతో..రాబోయే కాలంలో అస్పర్ధమే వాడకాన్ని నిషేధించే అవకాశం కనిపిస్తోంది.

1981 నుంచి అస్పరమే వాడకాన్ని అనుమతి ఇచ్చాయి ప్రభుత్వాలు. డైట్ కోక్‌. డైట్ సోడా, షుగర్ ఫ్రీ సోడా,ఐస్ క్రీమ వంటి అస్పర్టమే ఉన్న పదార్థాలు ఎక్కువగా మార్కెట్లోకి విడుదలవ్వడం మొదలయ్యాయి. అలా అప్పుడు మొదలైన అస్పర్టమే వాడకాన్ని ఇప్పుడు ఎన్నో ఉత్పత్తుల్లో యదేచ్ఛగా వాడేస్తున్నారు. త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని క్యాన్సర్ కారకంగా ప్రకటిస్తే..అప్పుడయినా ఆస్పర్టమే వాడకాన్ని కంపెనీలు ఆపేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − one =