టీడీపీకి మళ్లీ ఎన్టీయే తలుపులు తెరుస్తున్నట్టేనా?

TDP Likely To Returning in NDA Fold Ahead of 2024 Assembly Polls of AP,TDP Likely To Returning in NDA,NDA Fold Ahead of 2024 Assembly Polls,Assembly Polls of AP,Mango News,Mango News Telugu,TDP set for NDA return,BJP bid to revive NDA for 2024,TDP in Assembly Polls 2024,Chandrababu Naidu Makes His Move,Assembly Polls of AP Latest News,Assembly Polls of AP Latest Updates,Assembly Polls of AP Live News,TDP in Assembly Polls Latest News,TDP in Assembly Polls Latest Updates,TDP in Assembly Polls Live News,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra Pradesh News and Live Updates

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామాలు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ పెద్దలు పునరాలోచనలో పడడంతో వ్యవహారం తారుమారు కావడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా జాతీయ స్థాయిలో విపక్షాలు ఉమ్మడి రాగం ఆలపించే యత్నంలో ఉన్నాయి. దానిని విచ్ఛిన్నం చేయాలనే ఎన్టీయే ఆలోచిస్తోంది. అదే సమయంలో ఎన్టీయే బలోపేతం కూడా కీలకమని అంచనా వేస్తున్నారు. విపక్ష కూటమి ఏర్పాటు కాకుండా చూడడం, ఎన్టీయేలోకి కొత్త మిత్రులను, దూరమయిన పాతమిత్రులను సమీకరించడం ద్వారా మళ్లీ ఎన్నికల నాటికి పూర్వ వైభవం వస్తుందనే ధీమా బీజేపీ నేతల్లో ఉంది.

ఇటీవల జాతీయ స్థాయిలో మోడీ హవాకి అడ్డంకులు పడుతున్నాయి. వరుస పరిణామాలు అందుకు సాక్ష్యం. కర్ణాటకలో మోడీ ప్రచారం చేసిన చోట కూడా బీజేపీ ఓడిపోయింది. పైగా ఆయన సక్సెస్ రేట్ 39 శాతం మాత్రమే ఉంది. దాంతో పాటు మధ్యప్రదేశ్ పరిణామాలు బీజేపీని కంగారుపెడుతున్నాయి. మహారాష్ట్ర పీకలమీదకు వస్తుందా అనే బెంగ బయలుదేరింది. దాంతో దానిని చక్కదిద్దేందుకు కొత్త స్కెచ్ సిద్ధమవుతోంది. అందులో భాగంగానే టీడీపీ వంటి పాత మిత్రులను సమీకరించే ప్రయత్నాలు మొదలయినట్టు తెలుస్తోంది. తాజాగా బీజేపీ సమావేశంలో దాని మీద చర్చించినట్టు కథనాలు వస్తున్నాయి.

టీడీపీని కలుపుకోవడం ద్వారా తెలంగాణా, ఏపీలో తమకు ప్రయోజనం దక్కుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే బీజేపీలో ఉన్న చంద్రబాబు సన్నిహితులు దానికోసం ఒత్తిడి తెస్తున్నారు. దాంతో టీఎస్, ఏపీలో కూడా బీజేపీ, టీడీపీ చేతులు కలిపితే కనీసంగా అరడజను వరకూ ఎంపీ సీట్లు తాము దక్కించుకోవచ్చనే లెక్కల్లో బీజేపీ ఉంది. అంతేగాకుండా పవన్ కళ్యాణ్ ఎలానూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే సంకల్పంతో సాగుతున్న తరుణంలో ఎన్టీయే బలోపేతం చేయడం ద్వారా జాతీయ స్థాయిలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం తాము బలపడవచ్చనే ధీమా బీజేపీలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే బీజేపీ అధినేతలతో జగన్ స్నేహం రీత్యా అది సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయ. ఇటీవల వరుసగా ఏపీకి నిధుల వరద పారుతున్న తరుణంలో బీజేపీ మనసు మార్చుకుని మళ్లీ బాబుకి బెర్త్ కేటాయిస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంతిమంగా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి, బీజేపీకి నిజంగా ప్రయోజనం చేకూరుతుందంటే కలిసి పోటీచేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం బలంగా ముందుకొస్తోంది. చూడాలి మళ్లీ 2014 రిపీట్ అవుతుందో లేదో..

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 4 =