మునుగోడు ఉపఎన్నిక : మధ్యాహ్నం 1 గంట వరకు 41.3 శాతం పోలింగ్‌ నమోదు

Munugode Bye-election Polling Live Updates 41.3 Percent Polling Reported till 1 PM, Munugode Bye-election Polling Live Updates, Munugode Bye-election, 41.3 Percent Polling Reported Munugode, Mango News,Mango News Telugu, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట వరకు 41.3 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 2,41,855 మంది ఓటర్లలో 1 గంటవరకు 99780 మంది తమ ఓటు హక్కు వినియోగించున్నట్టు తెలిపారు. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. సాయంత్రం ఆరు గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికి, సమయం దాటినా కూడా ఓటు వినియోగించుకునే అవకాశం ఇవ్వనున్నారు.

మునుగోడు ఉపఎన్నికలో బరిలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. కొన్ని చోట్ల ఈవీఎం మెషిన్స్ మొరాయించడం, వీవీ ప్యాట్లలో సమస్య తలెత్తడంతో అధికారులు వెంటనే పరిష్కరించారు. అలాగే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రానికి సమీపంలో చెదురుముదురు సంఘటనలు జరుగుతుండగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు.

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ వివరాలు:

 • బరిలో ఉన్న అభ్యర్థులు: 47
 • ఓటర్ల సంఖ్య : 2,41,855
 • పురుష ఓటర్లు : 1, 21, 720
 • మహిళా ఓటర్లు : 1, 20, 128
 • ఇతరులు : 07
 • స‌ర్వీస్ ఓట‌ర్లు: 50
 • పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు: 5,686
 • పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు దరఖాస్తు చేసుకున్నవారు : 739
 • పోలింగ్‌ కేంద్రాలు:: 298
 • సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు: 105
 • పోలింగ్ సిబ్బంది : 2500
 • విధుల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర బలగాలు: 5000

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − eleven =