పాఠ్య పుస్తకాల్లో కూడా ఇండియా స్ధానంలో భారత్ పేరు

Even in text books the name of Bharat is in place of India,Even in text books,name of Bharat is in place of India,Mango News,Mango News Telugu,NCERT panel suggests replacing India,Netizens say as NCERT recommends,NCERT on reports of Bharat,NCERT, India,in text books, the name of Bharat, place of India,Bharat,Name of Bharat Latest News,Name of Bharat Latest Updates,Name of Bharat Live News
NCERT, India,in text books, the name of Bharat, place of India,Bharat

ఇప్పటి వరకూ భారతదేశాన్ని ఇండియాగా పిలుచుకునేవారు. అయితే ఈ పేరును భారత్‌గా మార్చేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ, జాతీయ వేదికలపై వాడేస్తోంది. ఇండియా పేరును భారత్‌గా అభివర్ణిస్తూ అన్ని చోట్లా బాగానే వాడుతోంది. దీంతో ఇప్పుడు చాలా జాతీయ స్ధాయి సంస్ధలు కూడా తమ వాడుకలో ఇండియా పేరు స్ధానంలో భారత్‌ పేరును చేరుస్తూ.. ఇండియా పేరును మారుస్తున్నాయి. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి హైస్కూల్, ఉన్నత విద్యా స్ధాయిలో పుస్తకాలు ముద్రిస్తున్న..నేషనల్ విద్యాశిక్షణ, పరిశోధన మండలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం బాట పట్టింది.

పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్ధానంలో భారత్ పేరు వాడేలా ఎన్సీఈఆర్టీ ప్యానెల్ ఒక ప్రతిపాదనను పంపింది. అయితే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పంపిన ప్రతిపాదనను దాని సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ఇకపై ముద్రించే పాఠ్య పుస్తకాల్లో ఇండియా స్ధానంలో భారత్ పేరు కనిపించనుందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ చెబుతోంది. దీని ప్రకారం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ముద్రించే పుస్తకాల్లో ఈ మార్పును అమలు చేయడానికి ఎన్సీఈర్టీ అడుగులేస్తోంది.

ఈ సంవత్సరం ఇండియాలో జరిగిన జీ20 సదస్సుతో పాటు ఆసియాన్ సదస్సు అలాగే కొన్ని ఇతర సందర్భాల్లో ఇండియా పేరుకు బదులు భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అతిథులకు ఆహ్వానాలు పంపింది. దీంతో ఇండియా కూటమి పేరు పెట్టడంతోనే మోడీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంతా భావించారు. దీనిపై కూటమి నేతలంతా ప్రత్యక్ష విమర్శలకు కూడా దిగారు. అయితే ప్రత్యేకించి పేరు మార్పును ఇంకా అంగీకరించని బీజేపీ గవర్నమెంట్..తర్వాత కూడా అదే పేరు ఎస్టాబ్లిస్ అయ్యేలా పనులు చేస్తూనే ఉంది. ఇండియా పేరుకు బదులుగా భారత్ అనే పేరు జనాలకు కూడా తెలీకుండానే అలవాటు చేసేసింది. అయితే ఆ తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ పేరు మార్పు బిల్లు ప్రవేశపెడుతుందని వార్తలు వినిపించినా .. అలా జరగలేదు.

ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ .. ఇకపై పాఠ్యపుస్తకాల్లో ఇండియా పేరును భారత్ గా వాడుకునేందుకు ఆమోద ముద్ర వేయడంతో దీనిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కేంద్రం అధికారికంగా ఇండియా పేరుకు బదులు భారత్ గా వాడాలంటూ ఎక్కడా ఆదేశాలు ఇవ్వకపోయినా కూడా.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ప్యానెల్ ఇలా నిర్ణయం తీసుకోవడంపై అంతా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 14 =