కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ సమన్లు జారీ

Congress Chief Sonia Gandhi and Rahul Gandhi Get ED Notices in National Herald Case, Congress Leader Rahul Gandhi Gets ED Notices in National Herald Case, Congress Chief Sonia Gandhi Gets ED Notices in National Herald Case, ED Notices in National Herald Case, ED Notices, National Herald Case, ED summons Congress Chief Sonia Gandhi and Rahul Gandhi over National Herald case, ED summons Congress Leader Rahul Gandhi over National Herald case, ED summons Congress Chief Sonia Gandhi over National Herald case, Enforcement Directorate sent notices to Congress president Sonia Gandhi and former party chief Rahul Gandhi, Enforcement Directorate sent notices to former party chief Rahul Gandhi, Enforcement Directorate sent notices to Congress president Sonia Gandhi, ED notice sent to the Gandhi family, National Herald Case News, National Herald Case Latest News, National Herald Case Latest Updates, National Herald Case Live Updates, Mango News, Mango News Telugu,

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీలకు సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వారిద్దరికీ ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే విచారణ నిమిత్తం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జూన్ 8న తమ ఎదుట హాజరుకావాలని ఈడీ సమన్లలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి వారిఇరువురి స్టేట్మెంట్స్ ను ఈడీ రికార్డ్ చేసే అవకాశమున్నట్టు సమాచారం. మరోవైపు ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ లను కూడా ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించిన విషయం తెలిసిందే.

ముందుగా నేషనల్ హెరాల్డ్ కంపెనీకి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో చేసిన ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఏడుగురిపై స్వామి కేసు నమోదు చేశారు. నేషనల్ హెరాల్డ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) చే ప్రచురించబడేది. రాహుల్ గాంధీ డైరెక్టర్‌గా ఉన్న యంగ్ ఇండియా లిమిటెడ్ (వైఐఎల్) అనే ప్రైవేట్ సంస్థ ద్వారా ఏజేఎల్ అనే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని గాంధీలు కొనుగోలు చేశారని సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. కేవలం రూ.50 లక్షలు చెల్లించి నిధుల దుర్వినియోగానికి కుట్ర పన్నారని, దీని ద్వారా ఏజేఎల్ కాంగ్రెస్‌కు బకాయిపడిన రూ.90.25 కోట్లను తిరిగి పొందే హక్కును వైఐఎల్ పొందిందని స్వామి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈడీ 2014లో ఈ అంశంపై మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here