బ్రిటన్ రాణి ఎలిజ‌బెత్-2 అంత్య‌క్రియ‌లకు హాజరుకానున్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము

President Droupadi Murmu To Attend For The Funeral of Briton Queen Elizabeth II in London, President Murmu To Attend Queens Funeral, President Murmu To Attend Queen Elizabeths Funeral, Queen Elizabeth Ii Dies Aged 96, Queen Elizabeth Ii Dies At 96, Queen Elizabeth II Passes Away At 96 , Mango News, Mango News Telugu, Queen Elizabeth II Death At 96, Queen Elizabeth II Death Live Updates, Queen Elizabeth II Latest News And Updates, England Queen Queen Elizabeth II, England Queen Dies Aged 96, England Citizens Weep Demise Of Her Queen , Queen Elizabeth II

దివంగ‌త‌ బ్రిటన్ రాణి ఎలిజ‌బెత్-2 అంత్య‌క్రియ‌లకు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హాజ‌రు కానున్నారు. భారత ప్రభుత్వం తరపున రాణి మృతికి సంతాపాన్ని తెలియజేయడానికి రాష్ట్రపతి ముర్ము లండన్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 17వ తేదీకి లండన్ చేరుకోనున్న ముర్ము, 19వ తేదీన క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరవనున్నారు. ఈ వివరాలను విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా క్వీన్ ఎలిజబెత్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు సంతాపం తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే భారతదేశం తరపున సంతాపాన్ని తెలియజేసేందుకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సైతం సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్‌ను సందర్శించారు. ఇక భారత ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 11న రాణి మృతికి గౌరవసూచకంగా జాతీయ సంతాప దినాన్ని పాటించింది.

యునైటెడ్ కింగ్‌డమ్, కామన్వెల్త్ నేషన్స్ అధిపతి అయిన క్వీన్ ఎలిజబెత్-2 96 సంవత్సరాల వయస్సులో స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ కాజిల్లో సెప్టెంబర్ 8న మరణించారు. సెప్టెంబర్ 19న ఆమె అంత్యక్రియలు వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రాణి శవపేటిక మంగళవారం సాయంత్రం ఎడిన్‌బర్గ్ నుండి లండన్ చేరుకుంది. అక్కడ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో ఉంచబడింది. బుధవారం పార్లమెంటరీ ఎస్టేట్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ హాల్‌కు తరలించనున్నారు. క్వీన్ ఎలిజబెత్-2 పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్-3 ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించనున్నారు. అలాగే అతని ముగ్గురు తోబుట్టువులు ప్రిన్సెస్ అన్నే, ప్రిన్స్ ఆండ్రూ మరియు ఎడ్వర్డ్ అలాగే ఆయన కుమారులు ప్రిన్స్ విలియం మరియు ప్రిన్స్ హ్యారీ పాల్గొననున్నారు. బ్రిటన్ రాజకుటుంబం మరియు ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి అతిథులు కూడా భారీగానే హాజరవనున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌లు దేశాల అధ్యక్షులు, ప్రధానులు స‌హా పలువురు ప్రముఖులు అంత్య‌క్రియ‌ల్లో పాల్గొననున్నారు. కాగా రాణి అంత్య‌క్రియ‌ల కోసం సుమారు 9 మిలియన్ డాలర్లు (దదాపు రూ.71 కోట్లు) వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + twelve =