లార్డ్స్‌లో భారత్ vs ఇంగ్లాండ్ రెండో టెస్టు : కేఎల్‌ రాహుల్‌ సెంచరీ

2nd Test, ENG vs IND 2nd Test, England vs India 2nd Test Day 1 Highlights, India vs England, India vs England 2nd Test, India vs England 2nd Test Day 1 Highlights, India vs England 2nd Test Highlights, india vs england 2nd test scorecard, India vs England Highlights 2nd Test Day 1, KL Rahul 127 not out after Rohit, KL Rahul Hits Century, Mango News, Opener KL Rahul Hits Century

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు శుక్రవారం నాడు లండన్ లోని లార్డ్స్‌ స్టేడియంలో ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తోలి ఇన్నింగ్స్ ప్రారంభించగా, ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ ధాటిగా ఆడుతూ సెంచరీ సాధించాడు. తొలిరోజు 248 బంతుల్లో 12 పోర్లు, ఒక సిక్స్ ల సాయంతో 127 పరుగులు చేశాడు. టెస్టుల్లో తన ఆరో సెంచరీ పూర్తి చేసుకోగా, ఇంగ్లాండ్ పైనే మూడో సెంచరీలు సాధించడం విశేషం. తొలిరోజు ఆట ముగిసేసరికి కేఎల్‌ రాహుల్‌(127)తో పాటుగా అజింక్య ర‌హానే(1) క్రీజులో ఉండగా, 90 ఓవర్లలకు భారత్ 3 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది.

ముందుగా ఓపెనర్ రోహిత్ శర్మ సంయమనంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ ను ముందుకు తీసుకెళ్లాడు. కేఎల్‌ రాహుల్‌ తో కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో సెంచరీకి చేరువైన రోహిత్‌ శర్మ 83 (145 బంతుల్లో 11×4, 1×6) పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన చటేశ్వర్ పుజారా 9 పరుగుల వద్దే వెనుదిరిగాడు. ఇక నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆచితూచి ఆడాడు. అయితే చక్కగా ఆడుతూ ఫామ్ అందుకున్న కోహ్లి తొలిరోజు చివర్లో 42 (103 బంతుల్లో 3×4) వద్ద పెవిలియన్ బాటపట్టడం అభిమానులకు నిరాశ కలిగించింది. మంచి స్కోర్ తో ఊపుమీదున్న భారత్ జట్టు రెండు రోజూ కూడా ఇదే ప్రదర్శన కొనసాగిస్తే రెండో టెస్టులో పట్టుబిగించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =