దుబ్బాకలో 1079 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు

BJP Candidate Raghunandan Rao Won in Dubbaka By-election

దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ పక్రియ సందర్భంగా తెలంగాణలో ఇంతకు ముందెన్నడూ చూడని ఉత్కంఠ ఏర్పడింది. హోరాహోరీగా పోరాడిన టిఆర్ఎస్, బీజేపీ పార్టీలలో చివరకు తిరుగులేని విధంగా బీజేపీ పార్టీ పైచేయి సాధించింది. బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌ రావు, టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1079 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. కౌంటింగ్ మొదటినుంచి ఆధిపత్యాన్ని చూపిస్తూ, మధ్యలో తడబడినా కూడా బీజేపీ విజయంవైపు దూసుకొచ్చింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కనీస స్థాయిలో కూడ ప్రభావం చూపలేక పోయింది. పోస్టల్ ఓట్లతో కలుపుకుని మొత్తం 1,64,669 ఓట్లు పోల్ అవగా, బీజేపీకి 63352, టిఆర్ఎస్ కు 62273, కాంగ్రెస్ కు 22196 ఓట్లు లభించాయి.

ఈ ఎన్నికల బరిలో మొత్తం 23 మంది అభ్యర్థులు నిలిచారు. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఈ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో తుది ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. పక్క ప్రణాళికతో, ప్రత్యేకమైన పోల్ మేనేజ్ మెంట్ తో రసవత్తరంగా సాగిన ఈ పోరులో బీజేపీ పార్టీ అద్భుత విజయాన్ని దక్కించుకుంది. రఘునందన్ రావు గెలుపుతో బీజేపీ పార్టీలో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. బీజేపీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ, ఆనందంలో మునిగిపోయారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =