తండ్రి ఆస్తిలో పెళ్లైన కూతురికి హక్కు ఉంటుందా ?

Does Married Daughter Have Right in Fathers Property,Does Married Daughter Have Right,Right in Fathers Property,Daughter Right in Fathers Property,Property,Womens Right to Property, Married Daughter Right, Fathers Property,Mango News,Mango News Telugu,Married Daughter Right Latest News,Married Daughter Right Latest Updates,Married Daughter Right Live News,Married Daughter Right Live Updates,Womens Right Latest News,Womens Right Latest Updates
property,women's right to property, married daughter right, father's property,

రూపాయీ, రూపాయీ నువ్వు ఏం చేయగలవు అంటే .. తోబుట్టువుల మధ్య వైరం పెంచగలను.. తల్లీ బిడ్డల మధ్య చిచ్చుబెట్టగలను.. చివరికి స్నేహితులను కూడా దూరం చేయగలనని చెప్పిందంటూ.. పెద్దలు కథలు కథలుగా చెబుతూ ఉంటారు.  నిజమే ఎంత అన్యోన్యంగా, చక్కగా ఉంటున్న కుటుంబం అయినా చిన్నచిన్న ఆస్తి పంపకాల్లో తేడా వస్తే ఎంత దూరం అయినా వెళతారు.

చివరకు రక్త సంబంధాన్ని కూడా కాదని కోర్టు మెట్లెక్కడానికి కూడా వెనుకాడరు. అనురాగానికి మారు పేరుగా ఉన్నవాళ్లు కూడా ఆస్తికోసం కొట్టుకోవడం వరకూ వెళతారు.ముఖ్యంగా ఒక తండ్రి ఆస్తి కోసం.. ఇద్దరు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, అన్నాచెల్లెళ్లు కొట్టుకోవడం చూస్తూనే ఉంటాము. అయితే చాలామంది అక్కకి కానీ చెల్లెకి కానీ ఆస్తిలో వాటా ఇమ్మంటే ఇవ్వాల్సింది అంతా పెళ్లి సమయంలోనే  కట్నం రూపంలో ఇచ్చాము కాబట్టి.. ఇక ఇవ్వమంటూ వాదిస్తూ ఉంటారు.

కానీ తల్లిదండ్రుల ఆస్తిలో కూతుళ్లుకు కూడా వాటా ఉంటుందనేది చాలా మందికి తెలియదు.ముఖ్యంగా భారత దేశంలో కూతురుకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే.. ఆమె పుట్టింటి ఆస్తుల్లో ఏమీ భాగం ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ తండ్రి సంపాదించిన  ఆస్తిలో కూతురుకు కూడా సమానమైన హక్కు ఉంటుంది. చాలా కుటుంబాల్లో కొడుకులు..తమ  తల్లిదండ్రులను తామే చూసుకుంటున్నాము పైగా అక్క చెల్లెళ్లకు తామే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాము కాబట్టి.. వారికి మన తల్లిదండ్రుల ఆస్తుల్లో హక్కు లేదనే ఆలోచనతోనే ఉంటారు.

కానీ మొట్టమొదటిసారిగా 1985లో మహిళల ఆస్తి హక్కు కోసం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. మహిళలకు కూడా పురుషుడితో పాటు తల్లిదండ్రుల ఆస్తిలో సమాన హక్కు ఉంటుందనే చట్టాన్ని తీసుకువచ్చారు.  ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నమెంట్..ఆ తర్వాత  చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని తీసుకువచ్చి.. వారి వారి రాష్ట్రాల్లో అమలు చేశాయి.

ఇలా రాష్ట్రాలే కాదు..   2004లో ఏకంగా కేంద్ర ప్రభుత్వమే  తండ్రి సంపాదించిన ఆస్తిలో..కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా సమానమైన హక్కు ఉంటుందని  ఒక ఉమ్మడి చట్టాన్ని తీసుకొచ్చింది.  ఆడపిల్లకు వివాహమైపోయి అత్తవారింటికి వెళ్లిపోయినా సరే.. ఆస్తిలో ఆమెకు వచ్చే వాటా ఆమెకి ఎప్పటికీ ఉంటుందని తెలిపింది. ఈ చట్టం వచ్చిన 20 ఏళ్లు కావొస్తున్నా.. ఈ చట్టంపై అవగాహన లేక ఇప్పటికీ ఆడపిల్లలకు అన్యాయం చేస్తూనే ఉన్నారని నిపుణులు అంటున్నారు. అందుకే  తమకు కుటుంబంలో న్యాయం జరగకపోతే ..కోర్టుకు వెళ్లి కూడా దక్కాల్సిన ఆస్తి హక్కును రాబట్టుకోవచ్చని చెబుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 11 =