ఉత్తర కొరియాలో విచిత్ర పరిస్థితి

Anniversary Of Ex-President’s Death, K-Pop Videos Got 7 Executed Under North Korea’s Kim Jong Un, Mango News, Mango News Telugu, North Korea, North Korea bans citizens from laughing drinking and shopping, North Korea bans laughing drinking and shopping, North Korea calls for unity, North Korea calls for unity as Kim Jong, North Korea Calls For Unity On Anniversary, North Korea Calls For Unity On Anniversary Of Ex-President’s Death, North Korea calls for unity on anniversary of Kim Jong Il’s death, north korea facts, north korea news, north korea rules, North Koreans banned from laughing for 10 days

ఉత్తర కొరియా.. ప్రపంచంలోనే ఐసోలేటెడ్ గా ఉండే దేశం ఇది. దానికి ఇతర దేశాలతో సంబంధాలు ఉండవు. అక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కడ విచిత్రమైన చట్టాలు కూడా అమలవుతుంటాయి. ఉత్తర కొరియాకి కిమ్ జోంగ్ ఉన్ ప్రస్తుత అధ్యక్షుడు. సరిగ్గా చెప్పాలంటే శాశ్వత అధ్యక్షుడు. ఆ దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఇల్ కి వారసుడు. కాగా, కిమ్ జోంగ్ ఇల్ పదేళ్ల క్రితం మరణించాడు. ఆయన పదో వర్ధంతి సందర్భంగా దేశంలో డిసెంబర్ నెల మొత్తం సంతాప నెలగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా.. ఆ దేశంలో కొన్ని కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. వీటిలో కొన్ని నిబంధనలు విచిత్రంగా ఉన్నాయి. ఉత్తర కొరియాకు చెందిన కొందరు ఈ విషయాలను రేడియో ఫ్రీ ఆసియాకు వివరించారు.

“సంతాపదినాలలో ప్రజలు నవ్వడంపై నిషేధం విధించారు. ఆల్కహాల్ తాగకూడదు. పుట్టిన రోజులు జరుపుకోరాదు. వినోద కార్యక్రమాల్లో పాలుపంచుకోరాదు. ఈ సమయంలో ఎవరి ఇంట్లోనైనా కుటుంబసభ్యులు కానీ, ఆప్తులు కానీ చనిపోయినా సరే పెద్దగా ఏడవకూడదు. అంతేకాదు, మాజీ అధ్యక్షుడి మరణానికి దేశ ప్రజలందరూ తప్పనిసరిగా విచారం వ్యక్తం చేయాలి. అది కూడా సామూహిక విచారం వ్యక్తం చేయాలి. దీనిపై నిఘా కూడా పెట్టనున్నారు. ఇవి పోలీసులకు ప్రత్యేక విధులుగా ఈ నెలలో ఉండనున్నాయి. ఒక వేళ ఎవరైనా ఈ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. ఈ నిబంధనలు పాటించకుంటే భావజాల నేరస్తులుగా పరిగణించి ఖైదు చేయనున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి ఆరోపణల కింద తీసుకు వెళ్లిన వారి జాడ కూడా తెలియకుండా పోయిందని కొందరు చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × two =