ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా మరో రికార్డు.. స్వీడ‌న్‌లోని డైమండ్ లీగ్‌లో జాతీయ రికార్డు బద్దలు

Olympic Medallist Neeraj Chopra Wins Silver Medal at Diamond League Breaks Own National Record, Neeraj Chopra Wins Silver Medal at Diamond League, Olympic Medallist Neeraj Chopra Wins Silver Medal at Diamond League, Olympic Medallist Neeraj Chopra Breaks Own National Record, Neeraj Chopra Breaks Own National Record, Own National Record, Olympic Medallist Neeraj Chopra, Neeraj Chopra, Olympic Medallist, Silver Medal at Diamond League, Diamond League, Neeraj Chopra Wins Silver Medal, Diamond League Neeraj Chopra Wins Silver Medal, Diamond League News, Diamond League Latest News, Diamond League Latest Updates, Diamond League Live Updates, Mango News, Mango News Telugu,

ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ భారత జావెలిన్‌ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా మరో రికార్డు సాధించాడు. స్వీడ‌న్‌లో జరుగుతున్న డైమండ్ లీగ్‌లో భాగంగా అద్భుత ప్రదర్శనతో సిల్వ‌ర్ మెడల్ కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం సాధించిన నీరజ్ చోప్రా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన డైమండ్ లీగ్‌లో మరోసారి తన చేయి పవర్ ఏంటో చూపించాడు. స్వీడ‌న్‌లోని స్టాక్‌హోమ్‌లో జ‌రిగిన ఈవెంట్‌లో చోప్రా జావెలిన్‌ను 89.94 మీట‌ర్ల దూరం విసిరి రికార్డు సృష్టించాడు. దీంతో గత నెల 14వ తేదీన తను నెలకొల్పిన రికార్డుని తానే బద్దలు కొట్టాడు.

జూన్ లో తుర్కులో జ‌రిగిన పావే నుర్మి గేమ్స్‌లో చోప్రా జావెలిన్‌ను 89.30 మీట‌ర్ల దూరం విసిరి జాతీయ రికార్డును నెలకొల్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత డైమెండ్ లీగ్‌లో దానిని బీట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక ఈ డైమెండ్ లీగ్‌లో వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ ఆండ‌ర్స‌న్ పీట‌ర్స్ త‌న జావెలిన్‌ను 90.31 మీట‌ర్ల దూరం విసిరి కొత్త మీట్ రికార్డును స్థాపించాడు. తద్వారా స్వ‌ర్ణ ప‌త‌కం సాధించాడు. ఆండ‌ర్స‌న్ తర్వాత నీరజ్ నిలవగా.. ఇక మూడో స్థానంలో నిలిచిన జులియ‌న్ వెబ‌ర్‌కు బ్రాంజ్ మెడ‌ల్ దక్కింది. కాగా జూలై 15వ తేదీ నుంచి 24 వ‌ర‌కు అమెరికాలోని యూజీన్‌లో జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో సత్తా చాటాలని నీర‌జ్ చోప్రా భావిస్తున్నాడు. చోప్రా సాధించిన ఈ విజయంపై పలువురు భారత క్రీడాకారులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here