భారత్ లో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు

Coronavirus, Covid B.1.1.529 variant, COVID-19, covid-19 new variant, Mango News, Mango News Telugu, New coronavirus Strain, New Covid 19 Variant, New Covid Strain Omicron, Omicron, Omicron covid variant, Omicron variant, Omicron Variant Cases, Omicron Variant Cases Rising, Omicron Variant Cases Rising Day By Day In India, omicron variant in India, Omicron Variant Is Spreading Very Fastly, omicron variant south africa, Update on Omicron

మన దేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు. ఈ రోజు రాజస్థాన్ మరియు ఢిల్లీలలో 4 చొప్పున ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఇప్పటివరకు మనదేశంలో ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు 49 కి చేరుకున్నట్లయింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 20 కేసులు వెలుగుచూశాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,784 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు నిన్న 252 మంది వరకు కరోనా వైరస్ వలన ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో 133.8 కోట్ల కరోనా వాక్సిన్ డోసులు వేశారు.

విమానాశ్రయాల్లో నిర్వహిస్తున్న పరీక్షల్లో చాలామందికి మొదట కరోనా నెగటివ్ వస్తుంది. ఆ తర్వాత ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి వారు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కరోనా సోకినట్లుగా తెలుసుకుంటున్నారు. తాజాగా మహారాష్ట్రలో 12 ఏళ్ల బాలిక కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ బారిన పడింది. ఈ మధ్యే వారి కుటుంబం నైజీరియా నుంచి మహారాష్ట్రకు వచ్చింది. దేశానికి వచ్చిన సమయంలో వారందరికీ పరీక్షలు నిర్వహించారు. కానీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. తర్వాత పంటి నొప్పితో ఆసుపత్రికి వెళ్లడంతో RTPCR చేయించాలని వైద్యులు సూచించారు. దీంతో పరీక్షలు చేయించగా ఆమెకు కరోనా నిర్దారణ అయింది. వెంటనే జ‌న్యు ప‌రీక్ష‌లు చేయగా ఆమెకు ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ప్రజలు కరోనా విషయంలో మునుపటిలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా ఉండరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 12 =