పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi Greets West Bengal Chief Minister Mamata Banerjee on her Birthday Today,PM Modi Greets Mamata Banerjee,West Bengal Chief Minister,West Bengal Chief Minister Mamata Banerjee,Mango News,Mango News Telugu,Mamata Banerjee Birthday Wishes,Mamata Banerjee Age,Mamata Banerjee Son,Mamata Banerjee History,Mamata Banerjee Real Name,Mamata Banerjee Wikipedia,Is Mamata Banerjee Married,Mamata Banerjee Birthday Photo,Mamata Banerjee Birthday Date,Bengal Mamata Banerjee Birthday,Happy Birthday Mamata Banerjee,Mamata Banerjee Belong To Which Party,Mamata Banerjee Ruling Period,Mamata Banerjee Complaint Number,Cm Mamata Banerjee Mobile Number,Mamata Banerjee Helpline Number,Mamata Banerjee Personal Phone Number

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు 68వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సీఎం మమతా బెనర్జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. “మమతా దీదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె మంచి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో టీఎంసీ పార్టీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సీఎంగా మమతాబెనర్జీ వరుసగా మూడోసారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పుట్టినరోజు సందర్భంగా పార్టీలకతీతంగా దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకులు, ముఖ్యమంత్రులు, టీఎంసీ పార్టీ కీలక నేతలు సీఎం మమతా బెనర్జీకి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, అస్సాం సీఎం హిమంతా బిస్వా శర్మ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మమతా బెనర్జీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆమె ప్రజల సేవలో సుదీర్ఘంగా కొనసాగుతూ, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × one =