కరోనా వ్యాప్తి: నవంబర్ 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు

COVID-19, Maharashtra, Maharashtra Govt, Maharashtra Govt Extends Covid-19 Lockdown, Maharashtra Govt Extends Covid-19 Lockdown till November 30, Maharashtra Lockdown, maharashtra lockdown extended, Maharashtra Lockdown Extension, Maharashtra Lockdown News, Maharashtra Lockdown updates

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పరిస్థితి కారణంగా నవంబర్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తునట్టు ప్రకటించింది. ఇంతకు ముందు ‘మిషన్‌ బిగిన్‌ అగైన్‌’ పేరుతో రాష్ట్రంలో అనుమతించబడిన కార్యకలాపాలు అదే విధంగా కొసాగుతాయని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 50 శాతం కెపాసిటీ మించకుండా హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, బార్లను తెరవడాన్ని కొనసాగించనున్నారు. అలాగే ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్‌లోని అన్ని నాన్ ఎస్సెన్షియల్ వస్తువుల పారిశ్రామిక మరియు ఉత్పాదక యూనిట్లు పనిచేయడానికి అనుమతి ఇచ్చారు. దుకాణాలు తెరిచే సమయాన్ని కూడా 2 గంటలు పెంచుతూ రాత్రి 9 వరకు అవకాశం ఇచ్చారు. మరోవైపు పండుగ సీజన్ ముగిసిన తరువాత పాఠశాలలను తిరిగి తెరవడంపై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − fifteen =