ఉక్కుమనిషి స‌ర్దార్ వల్లభాయ్ ప‌టేల్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, అమిత్ షా

PM Modi Pays Homage to Sardar Vallabhbhai Patel on his Punya Tithi and Recalls his Everlasting Contribution to India,PM Modi tributes to Sardar Vallabhbhai Patel,Amit Shah pay tributes to Iron Man,Sardar Vallabhbhai Patel,Mango news,mango news telugu,PM Modi,Amit Shah,Sardar Vallabhbhai Patel Statue,Sardar Vallabhbhai Patel University,Sardar Vallabhbhai Patel International Airport,Sardar Vallabhbhai Patel National Police Academy,Sardar Vallabhbhai Patel Jayanti,Sardar Vallabhbhai Patel Hospital,Sardar Vallabhbhai Patel Statue Cost,Sardar Vallabhbhai Patel Quotes,Sardar Vallabhbhai Patel Death Anniversary,Iron Man Of India Statue Height,Sardar Vallabhbhai Patel Iron Man Of India

ప్రముఖ స్వాత్రంత్య యోధుడు, దేశ మొదటి ఉప ప్రధాని, ఉక్కుమనిషి స‌ర్దార్ వల్లభాయ్ ప‌టేల్ వర్ధంతి/పుణ్య తిథి సందర్భంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు నేతలు ఆయ‌న‌కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతదేశానికి స‌ర్దార్ వల్లభాయ్ ప‌టేల్ చేసిన ఎనలేని సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రధాని మోదీ ట్వీట్‌ చేస్తూ, “సర్దార్ పటేల్‌కు ఆయన పుణ్య తిథి నాడు నివాళులర్పిస్తున్నాను. భారతదేశానికి, ముఖ్యంగా మన దేశాన్ని ఏకం చేయడంలో మరియు సర్వతోముఖాభివృద్ధికి ఊతమివ్వడంలో ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేస్తూ, “సర్దార్ పటేల్ కేవలం ఊహాశక్తి ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, తన ఊహలను నిజం చేసేందుకు కృషి చేసిన కర్మయోగి. హిమాలయాల వంటి బలమైన సంకల్పం మరియు నాయకత్వ సామర్థ్యం కారణంగా దేశం అతన్ని సర్దార్‌గా పరిగణించింది. జాతి స్ఫూర్తి అయిన సర్దార్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =